ఈ మధ్య కాలంలో సీరియల్ నటులకు, నటీమణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వీరిదే హవా. వారానికి 5 రోజుల పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేది వీళ్ళే కాబట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా వీళ్లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది.ఏదైనా పండుగ వస్తే వీళ్ళతోనే స్పెషల్ గా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి బుల్లితెర యాజమాన్యాలు. వీటి వల్ల టి.ఆర్.పి తో యూట్యూబ్ లో కూడా మంచి వ్యూయర్ షిప్ వస్తుంది.
వీళ్ళ సోషల్ మీడియాలో ఖాతాలకు కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇక బుల్లితెర నటీమణులు అయితే సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేసి.. పాపులారిటీని పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో నటి నిత్యా రామ్ కూడా ఒకరు. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ మొదట కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించేది. అయితే ‘ముద్దు బిడ్డ’, ‘అమ్మ నా కోడలా’ వంటి సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.
అయితే 2019 లో (Serial Actress) ఈమె పెళ్లి చేసుకుని తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. దీంతో నటనకు కూడా దూరమైంది. అయితే కొద్ది రోజుల క్రితం ఇండియాకి తిరిగి వచ్చేయడంతో మళ్ళీ నటనపై దృష్టి పెట్టింది. త్వరలో ‘అన్న’ అనే తమిళ సీరియల్ తో ఈమె రీ ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల రిలీజ్ అయ్యి ఆమె ఫ్యాన్స్ ను ఖుషి చేయిస్తుంది అని చెప్పాలి.