Bichagadu 2: ‘బిచ్చగాడు 2’ హీరోపై విజయ్‌ వైరల్‌ కామెంట్స్‌… ఏమన్నాడంటే?

  • May 17, 2023 / 11:49 AM IST

చిన్న సినిమా.. పెద్ద విజయం… ఈ మాటకు ఇటీవల కాలంలో చాలా సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే కొన్నేళ్ల క్రితం ‘బిచ్చగాడు’ సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. సగటు హీరోలు చేసే సినిమాలకు భిన్నంగా సినిమా చేసే విజయ్‌ ఆంటోని నుండి వచ్చిన సినిమా అది. మదర్‌ సెంటిమెంట్‌, వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను కలిపి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా వచ్చిన ఏడేళ్లకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి.

‘బిచ్చగాడు 2’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌, మీమర్స్‌ అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా మీకు కాకుండా ఎవరికి బాగుంటుంది అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘ఒకవేళ ‘బిచ్చగాడు’ సిరీస్‌ చిత్రాల్లో మీరు నటించకపోయి ఉంటే.. మీ స్థానంలో ఏ హీరో అయితే బాగుంటారని భావిస్తున్నారు?’’ అని అడగ్గా… మహేశ్‌బాబు అని చెప్పాడు.

‘బిచ్చగాడు’  (Bichagadu 2) సినిమాలోని ప్రధాన పాత్రధారి హావభావాలను మహేశ్‌ బాబు అద్భుతంగా పలికించగలడని విజయ్‌ ఆంటోని చెప్పుకొచ్చారు. ఇక ఇదే పాత్ర తమిళంలో విజయ్‌ గానీ, అజిత్‌ గానీ సూట్‌ అవుతారని చెప్పాడు. ఇక తొలి ‘బిచ్చగాడు’ సినిమా కథ తొలుత శ్రీకాంత్‌ దగ్గరకు వెళ్లిందని, కానీ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రెండో ‘బిచ్చగాడు’ మహేష్‌ బాబు / అజిత్‌ / విజయ్‌ పేర్లు బయటకు వచ్చాయి. అయితే ‘బిచ్చగాడు 2’ సినిమా.. ‘బిచ్చగాడు’ సినిమా కథకు సీక్వెల్‌ కాదట.

ఈ సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ను చూపించబోతున్నారట. సినిమాలో హీరో గురుమూర్తి పాత్రలో కనిపిస్తాడు. అతను మన దేశంలో ఏడో అత్యంత సంపన్నుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో విజయ్‌ సరసన హీరోయిన్‌ కావ్యా థాపర్‌ నటించారు. అలాగే, త్వరలో విజయ్‌ ఆంటోని స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అలాగే ఆయన నటించిన ఐదు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus