RRR Movie : ఇక ఎవరి దారి వాళ్లదే!

దాదాపు మూడేళ్ళ వరకూ ఆర్ఆర్ఆర్ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పాలి. అసలు మల్టీస్టారర్ సినిమాలు చేయడం అనేది అంత సులువైన పని కాదు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక దర్శకుడు రాజమౌళి ఏదైతే సులువు కాదు అని అనుకుంటారో దానిని సుసాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పక్కా ప్రణాళికతో వెళితే మల్టీ స్టారర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించబచ్చు అని ఆయనకు ఎప్పటినుంచో ఒక ఆలోచన ఉంది.

Click Here To Watch NOW

ఇక దాన్ని రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో సాధ్యమయ్యేలా చేశాడు. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలు అంటే హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం లేకపోతే ప్రాజెక్టును పూర్తి చేయడం ఎవరికీ సాధ్యం కాదు. దానికితోడు అభిమానుల్లో గుర్తించడం కూడా చాలా శ్రమతో కూడుకున్న పని కానీ రాజమౌళి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరపైకి తీసుకువచ్చాడు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇక దాదాపు మూడేళ్ల వరకు ఎంతో హార్డ్ వర్క్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ముందుకు వెళ్లి పోతున్నారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హాలిడేస్ కు వెళ్లనున్నారు. ఇక రాజమౌళి తన ప్రతి సినిమా పూర్తయిన వెంటనే కుటుంబ సభ్యులను తీసుకుని తనకు నచ్చిన విదేశాలకు వెళుతుంటాడు.

అదే తరహాలో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా స్పెషల్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక హాలిడేస్ అనంతరం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మొదలు పెట్టానున్నాడు. ఇక రామ్ చరణ్ శంకర్ సినిమాను పూర్తి చేయనున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus