Acharya: ఆచార్య విషయంలో ఆయన ఎంపిక తప్పేనా?

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకునే కొరటాల శివ మెగాస్టార్ కోరిక మేరకు ఆచార్య సినిమాకు మాత్రం మణిశర్మను ఎంపిక చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకు హైలెట్ అవుతాయనుకున్న సన్నివేశాలు సైతం సరైన బీజీఎం లేక ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. ఆచార్య విషయంలో మణిశర్మ ఎంపిక తప్పని మెగాస్టార్ నమ్మకాన్ని మణిశర్మ వమ్ము చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మణిశర్మను నమ్మి ఛాన్స్ ఇవ్వడమే చిరంజీవి కొరటాల శివ చేసిన పెద్ద తప్పు అని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు ఆచార్య సినిమా నష్టాలు అంచనాలకు అందని స్థాయిలో ఉన్నాయి. ఈ నష్టాలను భర్తీ చేయడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. ఆచార్య నష్టాలకు సంబంధించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు రాస్తున్న బహిరంగ లేఖలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేసి ఆచార్య మేకర్స్ భారాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆచార్య నష్టాలను ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. చిరంజీవి వెకేషన్ లో ఉండటంతో ఈ ప్రశ్నల గురించి క్లారిటీ రావడం లేదు. మరోవైపు ఓటీటీలో ఆచార్య స్ట్రీమింగ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆచార్య ఈ నెల 20వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. చిరంజీవి రొటీన్ కథలకు నో చెప్పాలని కొత్తదనం ఉన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి భవిష్యత్తు సినిమాలు విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే గాడ్ ఫాదర్ షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus