బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కొరియోగ్రాఫర్ సందీప్ 5 వారాల ఇమ్యూనిటీ ని గెలుచుకుని ఫస్ట్ కంటెస్టెంట్ గా ఈ సీజన్ లో మారాడు. అయితే, కేవలం తను హౌస్ మేట్స్ లో కొంతమంది సపోర్ట్ తోనే ఇక్కడి వరకూ వచ్చాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అమర్ దీప్, శోభాశెట్టి, షకీల, శుభశ్రీ, గౌతమ్, థామిని ఇలా అందరూ సందీప్ కి ఇంకా ప్రియాంకకి ఇద్దరికీ సపోర్ట్ చేయడం వల్లే వాళ్లిద్దరూ ఫైనల్ రేస్ లో నిలిచారని చెప్తున్నారు. అంతేకాదు, ఫేస్ ద బీస్ట్ టాస్క్ లో కూడా వీరిద్దరినీ ఎక్కువ సేపు ఉండేలా కావాలనే గేమ్ ఆడించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలు నిజంగా ఏం జరిగింది. తెరవెనుకు ఏం జరుగుతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.,ఆట సందీప్ నీతోనే డ్యాన్స్ షో ద్వారా మొన్నటిదాకా మా టీవీ మేనేజ్మెంట్ కి బాగా దగ్గరగా ఉన్నాడు. అలాగే, ఆ షోలో విన్నర్ గా కూడా నిలిచాడు. దీంతో టీమ్ తో మంచి సంబంధాలు ఉంటాయి. అలాగే, ప్రియాంక, అమర్ దీప్ లు కూడా రీసంట్ షోలో పెర్ఫామ్ చేశారు. అందుకే, టీమ్ మొత్తం వీరికి కొంచెం సపోర్ట్ గా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సందీప్ ని , ప్రియాంక ని, అమర్ దీప్ ని ఎలాగైనా సరే టాప్ 5లో నిలబెట్టడం కోసం బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోదా అనేది సందేహంగా మారింది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ కూడా 5 వారాల ఇమ్యూనిటీ ఇవ్వలేదు. సీజన్ 2లో కౌషల్ ఆడేటపుడు నేరుగా అన్ని వారాలు నామినేట్ అయ్యే పవర్ ఇచ్చి కావాలని నామినేషన్స్ లోకి తెచ్చారు. కానీ, ఇమ్యూనిటీ మాత్రం ఇన్ని వారాలు ఇవ్వలేదు. ఇచ్చినా రెండు వారాలు మాత్రమే ఇచ్చారు.
అయితే, ఈసారి ఫస్ట్ వీక్ ఇలా ఇమ్యూనిటీ రావడం అనేది ఒక రకంగా సందీప్ కి ప్లస్ అయినా, ఆట పరంగా చూస్తే కెప్టెన్సీ రేసులో పాల్గొనడం కానీ, లేదా వేరే టాస్క్ లు ఆడటం కానీ కొద్దిగా వెనకబడే అవకాశం కూడా ఉంది. మరి సందీప్ ఈ పవర్ అస్త్రాన్ని ఎలా ఉపయోగించుకుని ఆటలో ముందుకు వెళ్తాడు అనేది చూడాలి. మరి సందీప్ కి ఈ 5 వారాలు ఇమ్యూనిటీ రావడం అనేది జెన్యూన్ గా అనిపిస్తో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫైయిర్ ఆర్ అన్ ఫైయిర్ అనేది చెప్పండి..
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!