మన సినిమాల్లో అన్నదమ్ముల అనుబంధం ప్రత్యేకమైంది

అన్నదమ్ముల అనుబంధం ప్రత్యేకమైంది. స్నేహితుల్లా ఆనందాన్ని పంచుకుంటారు. శత్రువుల్లా కొట్టుకుంటారు. కష్టమొస్తే సాయం చేసుకుంటారు. ఒక సారి అన్న మాటకు తమ్ముడు గౌరవం ఇస్తే.. మరోసారి తమ్ముడి సలహాను అన్నపాటిస్తాడు. తెలుగు చలన చిత్రాల్లో వీరిద్దరిని రామ లక్ష్మణుడిలా చూపించారు. వాలి సుగ్రీవిడిలా చిత్రీకరించారు. ఇలా సినిమాల్లో అన్నదమ్ముల్లా ఆకట్టుకున్నవారి గురించి స్పెషల్ ఫోకస్.

బెస్ట్ ఫ్రెండ్స్ గా ..గుండమ్మ కథ. తెలుగు సినిమాలు ఉన్నంత వరకు నిలిచిపోయే సినిమా. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా చెప్పుకునే నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కలిసి నటించిన ఈ చిత్రం ఓ ఆణిముత్యం. అప్పటికే ఇద్దరూ మంచి స్టార్లుగా ఎదిగారు. ఆ హోదాను పక్కన పెట్టి అన్నదమ్ముల్ల నటించారు. మల్టీ స్టారర్ సినిమాలకు బాట వేసారు. ఇందులో మంచి మిత్రుల్లా జీవించారు. ఇద్దరి అభిమానులకి కనుల పండుగ ఈ సినిమా.

బిడ్డల్లా ..మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ లలో అన్నయ్య సినిమా ఒకటి. ఇందులో తమ్ముళ్లను బిడ్డల్లా చూసుకునే అన్నయ్య గా చిరు ఆకట్టుకున్నారు. అన్న రామరాజ్ గా చిరంజీవి, తమ్ముళ్లుగా రవితేజ(రవి), వెంకట్ (గోపి) నటించారు. అన్నయ్య ప్రేమను అర్ధం చేసుకోని తమ్ముళ్ళు .. సొంత అన్ననే అవమానించి దూరంగా వెళ్ళిపోతారు. ఆపదలో చిక్కుకుంటారు. అప్పుడు వారిని చిరు కాపాడి, క్షమిస్తాడు.

అన్న అగ్గి .. తమ్ముడు కూల్కవలలు ఒకే రూపంతో జన్మించడం. అందులో ఒకరు హార్డ్, మరొకరు సాఫ్ట్ గా ఉండడం అనే కథలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే వచ్చాయి. కాని వారిద్దరికి కనిపించని కనెక్షన్ పెట్టి, హిట్టి కొట్టిన సినిమా మాత్రం హలో బ్రదర్ మాత్రమే. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. రఫ్ నాగార్జున సలహా ఇస్తుంటే, క్లాస్ నాగ్ పాటిస్తుంటాడు. చివరికి ఇద్దరు కలిసి విలన్ ని చితక కొడతారు. ఈ సినిమా మాస్, క్లాస్ ఆడియన్స్ ని అలరించింది.

అన్నకలని సాధించే తమ్ముడిగా..చిరంజీవి అన్నయ్య చిత్రంతో మెప్పిస్తే.. తమ్ముడు పవర్ స్టార్ తమ్ముడిగా సత్తా చాటారు. తమ్ముడు సినిమాలో అచ్యుత్ (చక్రి) కి తమ్ముడు సుబ్రహ్మణ్యంగా పవన్ నటించారు. చిత్రం ప్రారంభంలో అల్లరి చిల్లరిగా తిరిగే పవన్ .. అన్న అచ్యుత్ గాయాలతో ఆస్పత్రి పాలైతే .. లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. తన పంచ్ లతో అన్నని మంచం పట్టించిన వాడిని ఓడిస్తాడు. అన్న కలని నెరవేరుస్తాడు. నాక్కూడా ఇలాంటి తమ్ముడు ఒకరు ఉంటే బాగుంటుందని ప్రేక్షకుడు అనుకునేలా పవన్ నటించాడు.

తమ్ముడికి ప్రేమతో..తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో మళ్ళీ మొదలయ్యాయి. ఇందులో చిన్నోడు పెద్దోడిగా మహేష్, వెంకటేష్ నటించారు. పెద్దోడికి సంపాధన అంటూ ప్రత్యేకంగా లేకపోయిన తమ్ముడి ఖర్చులకు డబ్బులు ఇస్తుంటాడు. తమ్ముడిని ప్రేమించే పెద్దోడిగా వెంకటేష్, అన్నను గౌరవించే తమ్ముడిగా మహేష్ అద్భుత నటన ప్రదర్శించారు. నిజ జీవితంలో అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, కోపాలు, అలకలు.. వీరిద్దరు తెర పై చూపించారు.

అన్నను ద్వేషించే..శివాజీ, అశోక్. వీరికి అమ్మలు వేరైనా తండ్రి ఒకడే. కాని అశోక్ అమ్మ, శివాజీని కూడా సొంత బిడ్డలా చూసుకుంటుంది.శివాజీ కూడా కన్న తల్లిగా ప్రేమిస్తాడు. ఇది అశోక్ కి నచ్చదు. శివాజీని అన్నగా గౌరవించడు. ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. శివాజీని తన తల్లి అసహ్యించుకునేలా అశోక్ నటిస్తుంటాడు. అన్నను మానసికంగా హింసిస్తాడు. అన్నను ద్వేషించే తమ్ముడి పాత్రలో షఫీ, తమ్ముడిని మంచివాడిగా మార్చాలనే అన్నగా ప్రభాస్ నటన కన్నీరు తెప్పిస్తుంది.

నేటి అన్నాదమ్ముళ్ళా..జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ముళ్ళు(చారి, నరసింహ)గా కన్పించిన చిత్రం అదుర్స్. వీరిద్దరూ రూపంలో ఒకటిగా కనిపించినా ఇద్దరి అలవాట్లు పూర్తిగా భిన్నం. చారి వాగుడుకాయ్. నరసింహ తక్కువ మాట్లాడుతాడు. ఒకరు కామెడీ పండిస్తే.. మరొకరు యాక్షన్తో అధరగొడుతాడు. వీరిద్దరూ సినిమా చివరి వరకు దూరంగా పెరగడంతో పెద్దగా అనుబంధం కనిపించదు. కాని క్లైమాక్స్ లో నరసింహ దెబ్బతిని కింద పడిపోతే .. అసలు ఫైట్ అంటేనే భయపడే చారి కోపంతో విలన్స్ ను ఎదుర్కొంటాడు. అన్న కోసం తమ్ముడు.. తమ్ముడి కోసం అన్న ఏ పని అయినా చేస్తారని ఈ ఒక్క సీన్ ద్వారా తెలిపారు.

అన్నదమ్ముల రక్తంలో ఉండే మ్యాజిక్..రామ్, లక్ష్మణ్. అన్నదమ్ములు. చిన్నపటినుంచి ఒకరంటే ఒకరికి పడదు. పెద్దయ్యాక కూడా ఒకరి పనికి ఒకరు అడ్డుతగులుతూనే ఉంటారు. రామ్ ని చంపాలని శివా రెడ్డి ప్రయత్నించాడని తెలుసుకునే సరికి లక్ష్మణ్ రక్తం ఉడికి పోతుంది. శివారెడ్డి ని చావ గొడుతాడు. ఎందుకంటే అదే అన్నదమ్ముల రక్తంలో ఉండే మ్యాజిక్ అంటూ లక్ష్మణ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ సినిమాలో హైలట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus