సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతి, సమ్మర్, దసరా పండుగ సమయంలో రిలీజవుతాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది సమ్మర్ లో వకీల్ సాబ్ మినహా మరే సినిమా రిలీజ్ కాలేదు. జులై నుంచి థియేటర్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నా 100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వచ్చే వరకు పెద్ద హీరోలు తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు దసరా సీజన్ పై ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య, ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాల షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఈ రెండు సినిమాలు దసరా రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వస్తుండటంతో ప్రభాస్, చిరంజీవి మధ్య క్లాష్ తప్పదని తెలుస్తోంది. ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలకు కథ పరంగా పోలికలు లేకపోయినా ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజైతే థియేటర్ల సమస్య ఎదురవుతుంది.
రెండు సినిమాలు హిట్టైతే ఏ సమస్య లేదు కానీ ఒక సినిమా హిట్ టాక్ సంపాదించుకుని మరో సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న సినిమా దారుణంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మరి చిరంజీవి, ప్రభాస్ సినిమాలు క్లాష్ అవుతాయో లేదో తెలియాలంటే ఈ సినిమాలు రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఈ ఇద్దరు హీరోలు దసరాకే తమ సినిమాలను రిలీజ్ చేస్తే ఏ హీరో పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!