టాలీవుడ్లో హిట్లు, రికార్డులతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కల్యాణ్. అందుకే వరుస ఫ్లాప్‌లు ఇస్తున్నా… అభిమానుల ప్రేమ అలానే కంటిన్యూగా పొందుతూనే ఉన్నారు. అయితే వపన్ చేసిన సినిమాల్లో సగం రీమేక్‌లే అని తెలుసా? కావాలంటే పవన్ ఫిల్మోగ్రఫీ ఒకసారి చెక్ చేసుకోండి… మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అలా రీమేక్‌లు చేయడం చిన్నతనం కాదు, అదేమంత ఈజీ కాదనే విషయమూ గుర్తించాలి.
మామూలుగా టాలీవుడ్‌లో రీమేక్లు అంటే మనకు గుర్తొచ్చే హీరో వెంకటేశ్. చాలావరకు వెంకీ రీమేక్‌లు చేస్తుంటారు. అయితే పర్సంటేజ్ ప్రకారం చూస్తే… వెంకీ కంటే పవన్ సినిమాలే ఎక్కువ రీమేక్‌లు. సుమారు 50 శాతం వేరే భాషల నుండి తీసుకొన్న సినిమాలే. తొలి సినిమా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ కూడా రీమేకే. హిందీలో మంచి విజయం సాధించిన ‘ఖయామత్ సే ఖయామత్’ను తెలుగు తగ్గట్టుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన ‘గోకులంలో సీత’సినిమాను `ఇండియా టుడే` చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు.
ఆ తర్వాత వచ్చిన సుస్వాగతం (లవ్ టుడే), ‘తమ్ముడు’ (జో జీతా వహీ హై సికిందర్), ‘ఖుషి’(ఖుషి), ‘అన్నవరం’ (తిరుప్పాచి), ‘తీన్‌మార్’ (లవ్ ఆజ్‌కల్), ‘గబ్బర్ సింగ్’ (దబంగ్), ‘గోపాల గోపాల’ (ఓమై గాడ్), ‘కాటమరాయుడు’ (వీరమ్), , ‘వకీల్ సాబ్’ (పింక్) రీమేక్‌లే. ఇప్పుడు చేస్తున్న ‘భీమ్లా నాయక్’ కూడా మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ అనే విషయం తెలిసిందే.