Suhas, Sohel: సుహాస్, సోహైల్..ల మధ్య తేడా అది…ఇప్పటికైనా!

గత శుక్రవారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా సక్సెస్ అందుకుంది. అయితే అదే రోజు ‘బిగ్ బాస్ 4 ‘ కంటెస్టెంట్ సోహైల్ నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. సో వీకెండ్ కి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎటువంటి చప్పుడు చేయలేదు. అయితే రిలీజ్ రోజున షో ముగిశాక హీరో సోహైల్ థియేటర్ బయట.. పబ్లిక్ టాక్ బ్యాచ్ తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

” ‘ఆంధ్ర’ జనాలు నా సినిమాని చూడండి, ‘నైజాం’ జనాలు నా సినిమాని చూడండి, ‘రాయలసీమ’ జనాలు నా సినిమా చూడండి. ‘బిగ్ బాస్’ లో ఉన్నప్పుడు సోహైల్ సోహైల్ అని కామెంట్లు పెట్టారు కదా అన్నా..? నా సినిమాలు ఎందుకు చూడటం లేదు? నేను లిప్ లాక్ ..లు పెట్టుకునే అసభ్యకరమైన సినిమాలు చేయడం లేదు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాలే చేస్తున్నాను. ‘బూట్ కట్ బాలరాజు’ అలాంటి సినిమానే” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్.

సోహైల్ కామెంట్స్ పై చర్చలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ‘అసలు సోహైల్ ని హీరోగా సినిమాలు చేయమని ఎవరు అడిగారు?’ అని ఒకరు, ‘కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే జనాలు ఎందుకు చూడరు’ అంటూ కొంత మంది ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అయితే సోహైల్ ‘బిగ్ బాస్ 4 ‘ కి ముందు కూడా సినిమాల్లో నటించాడు. ‘కొత్త బంగారు లోకం’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాల్లో సోహైల్ నటించాడు.

కానీ పెద్దగా గుర్తింపు లేని పాత్రలు అవి. ‘బిగ్ బాస్’ తో గుర్తింపు వచ్చింది కాబట్టి సినిమాల్లో గుర్తింపు ఉండే పాత్రలు సోహైల్ చేసే అవకాశం ఉంది. కానీ హీరోగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. అది కూడా తప్పు లేదు. చూడటానికి మనిషి బాగుంటాడు. కానీ హీరోగా చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్కువగా డాన్సులు, ఫైట్లు చేసే పాత్రలే చేస్తాను అంటే ఎలా? సుహాస్ నే తీసుకుందాం.

మొదటి నుండి అతను కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. హీరో అంటే ఎత్తు, అందం ఉండాలి అనే ఆలోచనల్ని కంటెంట్ తో బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. అతను ‘నా సినిమా చూడండి’ అని ఏడవట్లేదు కదా. అది సోహైల్ అర్ధం చేసుకోవాలి. సోహైల్ అయినా మొదటి నుండి పెద్ద ప్రాజెక్టులు చేశాడు. సుహాస్ (Suhas) మాత్రం యూట్యూబ్ కంటెంట్ తోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus