ఎలిమినేషన్ జోన్‌లో మిగిలి ఉన్న మోనాల్, హారికను ఒకరిని రక్షించే అవకాశం నాగార్జున నామినేట్ కాని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. అఖిల్, మెహబూబ్, లాస్య, అరియానా, సుజాత, దివి, దేవీ కలసి ఆ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలో నిర్ణయిస్తాడని నాగ్ చెప్పాడు. ఇద్దరికీ చెరో బీకర్ ఇచ్చి అందులో నీళ్లు పోయాలని ఆ ఏడుగురికి చెప్పాడు.
అఖిల్ వచ్చి మోనాల్‌కు సపోర్టు చేశాడు. అందుకే హారిక బీకర్‌లో నీళ్లు పోశాడు. ఇంట్లో తనకు మోనాల్ బెస్ట్ ఫ్రెండ్ అని…. ఆమెతో ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పాడు. హారికతో నాకు అంత కనెక్షన్ రాలేదు. అందుకే మోనాల్‌కే ఓటేశాడు. హారిక డ్యాన్స్ పార్టనర్ అయిన మెహబూబ్ కూడా మోనాల్‌కే ఓటేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంట్లో ఉండటం మంచిది కాబట్టి… మోనాల్‌ను ఇంట్లో ఉంచుతున్నాను అని చెప్పాడు.
దేవీ నాగవల్లి వచ్చి హారికకు సపోర్టు చేసింది. మోనాల్ బిగ్‌బాస్ షోకు అవసరమైన ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం, తెలుగులో మాట్లాడటం లాంటివి, రూల్స్ పాటించడం విషయంలో మోనాల్ కంటే హారిక బెటర్ అని దేవీ చెప్పింది. హారిక, మోనాల్ ఇద్దరూ నాకు క్లోజ్ అయినప్పటికీ… మోనాల్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. హారికతో నాకు అంత టైమ్ దొరకలేదు. అందుకే హారికను బయటకు పంపించాలని అనుకుంటున్నాను అంటూ లాస్య బీకర్లో నీళ్లు పోసింది.
మోనాల్‌తో నాకంత ర్యాపో లేదు. ఒకటి రెండు మిస్ కమ్యూనికేషన్స్ కూడా జరిగాయి అందుకే ఆమె బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని మోనాల్‌కు చెందిన బీకర్‌లో నీళ్లు పోసింది ఆరియానా. హారిక అయితే కొన్ని సందర్భాల్లో నాకు చాలా సపోర్టివ్‌గా నిలిచింది అని ఆరియానా చెప్పింది. మోనాల్ నాకు ఒకే అబద్ధం నాకు నాలుగు రకాలుగా చెప్పింది. నేను మామూలుగానే అబద్దం చెప్తే సహించను అని దివి చెప్పింది. అందుకే మోనాల్‌ను ఎప్పటికీ నమ్మలేను. హారికతో పెద్దగా కనెక్షన్ లేకపోయినా ఇద్దరిలో హారికనే బెటర్ అని తేల్చింది దివి. అందుకే మోనాల్ బీకర్‌లో నీళ్లు పోసింది.
3-3తో టై అయిన సందర్భంలో ఆఖరి ఓటేసే అవకాశం సుజాతకు వచ్చింది. డిసైడింగ్ ఓటును మోనాల్‌కు వేసి… హారికను ఇంటి నుంచి పంపించేయాలని నిర్ణయించింది సుజాత. తెలుగు వచ్చినా వేరే భాషలో మాట్లాడటం నాకు నచ్చక ఆమెను బయటకు పంపించేయాలని నిర్ణయించింది. అలా ఈ రోజు ఎలిమినేట్ అయిన రెండో పార్టిసిపెంట్‌గా హారిక నిలిచింది. అయితే డోర్ దగ్గరకు వెళ్లేసరికి ఆమెను బయటకు వెళ్లకుండా ఆపేశాడు నాగ్. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న అందరికీ హారికకు జరిగిన ఈ ఫేక్ నామినేషన్ ఓ వార్నింగ్ అని నాగార్జున చెప్పాడు. ఎవరికివాళ్లు నామినేషన్‌లోకి రాకూడదు అనేలా ఆడాలని సూచించాడు నాగ్.
ఇదంతా బిగ్‌బాస్ గేమ్‌లో సీరియస్‌నెస్ కోసం చేశాడా? లేక నామినేషన్స్‌లో సీరియస్‌నెస్ తేవడానికి చూశాడా అనేది వేరే విషయం. చూసేవాళ్లకు మాత్రం బిగ్‌బాస్ 4 ఇప్పుడే మొదలైందా అనిపించేలా చేశాడు. ఈ సీరియస్‌నెస్ లేకపోవడం, కొత్తదనం లేకపోవడంతో ఏదో టైమ్‌పాస్ కోసం జనాలు చూశారు. ఇప్పుడు ‘రౌడీబేబీ’ ఫేక్ ఎలిమినేషన్ అందించిన మజాతో కచ్చితంగా జనాలు మరింత ఎంటర్‌టైన్ అవుతారన్నది మాత్రం నిజం. కొంపదీసి ఇదంతా ఐపీఎల్ వచ్చిందనే భయంతో చేయలేదు కదా అనే అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఐపీఎల్ చూసి.. బిగ్‌బాస్‌ను లైట్ తీసుకునే అవకాశమూ ఉంది కదా. చూద్దాం ఈ వారం ఏమవుతుందో.