Lalit Modi: లలిత్‌ మోడీ గురించి ఏమేం చెప్పబోతున్నారు..!

  • April 19, 2022 / 04:36 PM IST

క్రికెట్‌ – సినిమా మధ్య విడదీయరాని బంధం ఉంది అనే విషయం తెలిసిందే. ఈ కాంబోను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. అందుకే క్రికెటర్ కథలు సినిమాలుగా తీయడానికి చాలామంది ముందుకొస్తుంటారు. అలా సచిన్‌, ధోనీ లాంటి దిగ్గజాల జీవితాలు వెండితెరకొచ్చాయి. అయితే తొలిసారిగా క్రికెట్ పాలకుల జీవితం వెండితెరపైకి రాబోతోంది. మామూలుగా అయితే ఇది ఆసక్తికరమైన విషయమే. అయితే సినిమాగా రాబోతున్న వ్యక్తి జీవితంలో విమర్శలు, స్కామ్‌లు కూడా ఉన్నాయి. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది.

Click Here To Watch NOW

ఇప్పుడు అందరూ చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్న ఐపీఎల్‌ ఉరఫ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు రూపకర్త లలిత్‌ మోడీ. 15 ఏళ్ల క్రితం ఆయన మెదడులోని ఆలోచన కార్యరూపం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఆసక్తిని, మన దేశంలో ఉన్న ఆసక్తిని బాగా పసిగట్టిన లలిత్‌ మోడీ… క్యాష్‌ చేసుకోవాలనుకున్నారు. దిగ్గజ ఆటగాళ్లకు విలువకట్టి మరీ… టీమ్‌ల చేత కొనిపించాడు. ఆ రోజుల్లో ఇదో సంచనలం. ఈ ఫార్ములాను ఇప్పుడు చాలా దేశాలు లీగ్‌ల రూపంలో అనుసరిస్తున్నాయి.

ఇప్పుడు ఆ మొత్తం వ్యవహారాన్ని, దీనికి ఆధ్యుడైన లలిత్‌ మోడీ జీవితాన్ని సినిమాగా చూపించబోతున్నారు ప్రముఖ నిర్మాత విష్ణు ఇందూరి. ‘83’, ‘తలైవి’ లాంటి సినిమాలతో రీసెంట్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు లలిత్‌ మోడీ మీద సినిమా తీయనున్నారు. ఐపీఎల్ కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌ అయిన ల‌లిత్ మోడీ జీవితం ఆధారంగా ‘మావరిక్ కమిష‌న‌ర్‌: ది ఐపీఎల్ ల‌లిత్ మోడీ సాగా’ పేరుతో బొరియా మ‌జుందార్ అనే ర‌చ‌యిత ఓ పుస్త‌కం రాశారు.

ఆ పుస్తకం వచ్చే నెల 20న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఆ పుస్త‌కం ఆధారంగానే సినిమా తెర‌కెక్కుతోంది. ‘మావరిక్ క‌మిష‌న‌ర్‌’ బుక్‌ రైట్స్‌ని విష్ణు ఇందూరి ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయట. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించే ఈ చిత్రంలో స్టార్ నటులు కనిపిస్తారని సమాచారం. అయితే ఇందులో లలిత్ మోడీ తొలినాటి జీవితమే చూపిస్తారా? లేదంటే ఆయన మీద వచ్చిన విమర్శలు తదనంతర పరిణామాలు చూపిస్తారా అనేది చూడాలి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus