RRR Movie: ”లోడ్.. ఎయిమ్.. షూట్..”

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న నూతన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

కథ ప్రకారం.. అజయ్ దేవగన్.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్‌బాక్‌ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్‌ నటిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌2)న అజయ్ దేవగన్ పుట్టినరోజు కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌లో అతడి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ మోషన్ పోస్టర్ లో అజయ్ దేవగన్ సెంటర్ లో ఉండగా.. పదుల సంఖ్యలో సిపాయిలు ఆయన్ని టార్గెట్ చేస్తూ.. చేతిలో గన్స్ పట్టుకొని ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటారు.

బ్యాక్ గ్రౌండ్ లో ‘లోడ్.. ఎయిమ్.. షూట్’ అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. చివరగా.. అజయ్ దేవగన్ లుక్ ని రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు. అతడి లుక్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా కనిపించనున్నారు.


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus