‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలతో ఫామ్లో ఉన్న అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ గా దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.
అయితే అక్టోబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ మాత్రం నిరాశపరిచింది. ఒకసారి ‘ది ఘోస్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 1.81 cr |
సీడెడ్ | 0.66 cr |
ఉత్తరాంధ్ర | 0.90 cr |
ఈస్ట్ | 0.38 cr |
వెస్ట్ | 0.26 cr |
గుంటూరు | 0.42 cr |
కృష్ణా | 0.43 cr |
నెల్లూరు | 0.23 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.09 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.37 cr |
ఓవర్సీస్ | 0.62 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.08 cr (షేర్) |
‘ది ఘోస్ట్’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.22.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.6.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా బయ్యర్స్ కి రూ.16.92 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు స్పష్టమవుతుంది. దీంతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిందని చెప్పాలి.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!