ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగ్ హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. నాగార్జునకు హిందీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్రం సినిమా నాగార్జునకు హిందీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ది ఘోస్ట్ తో నాగ్ హిందీలో కూడా సక్సెస్ సాధించాలని అనుకున్నారు.
అయితే ది ఘోస్ట్ సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి చాలా కాలం క్రితమే అమ్మేశారు. ఆ కారణం వల్ల నాగార్జున ది ఘోస్ట్ హిందీ హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్ ను రిక్వెస్ట్ చేసి ఈ సినిమాను హిందీలో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా హిందీలో హిట్టైనా ముందే హక్కులు విక్రయించడంతో నిర్మాతలకు హిందీ థియేట్రికల్ కలెక్షన్ల నుంచి రూపాయి కూడా రాలేదు.
ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోందని ఆయన తెలిపారు. ఈ సినిమా హిందీలో సక్సెస్ సాధించినా ది ఘోస్ట్ నిర్మాతలకు మాత్రం రూపాయి కూడా రాదని బోగట్టా. సినిమా ఫ్లాపైతే మాత్రం కొంత మొత్తం హిందీ బయ్యర్ కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. వైజాగ్ ఏరియాలో నాగ్ సొంతంగా ది ఘోస్ట్ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం.
భారీ బడ్జెట్ తోనే ది ఘోస్ట్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సోలో హీరోగా నాగార్జున కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ సినిమాతో నాగార్జున కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.