ఈ ఏడాది మొత్తానికి ఒకే ఒక్క సినిమా “పుష్ప 2”తో (Pushpa 2 The Rule) ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక మందన్న (Rashmika Mandanna) వచ్చే ఏడాది 2025లో మాత్రం వరుస సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా తన తాజా చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” టీజర్ ను విడుదల చేసింది. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమా షూటింగ్ 2024 ఐపీఎల్ టైమ్ కి మొదలై, 2025 ఐపీఎల్ టైమ్ కి రిలీజ్ అయ్యేలా ఉంది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ టీజర్ లో రష్మిక చాలా సింపుల్ గా సగటు ఆధునిక యువతిగా కనిపించింది. సినిమా కథ ఇది లేదా పాయింట్ ఇది అని రివీల్ చేయకుండా.. కాలేజ్ లవ్ స్టోరీ థీమ్ లో సాగే కథ అని మాత్రమే రివీల్ చేసారు. అయితే.. రష్మిక పాత్రను మాత్రం మంచి స్ట్రాంగ్ & ఇండిపెండెంట్ ఉమెన్ అన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేశారు.
దర్శకుడిగా రాహుల్ కి ఇది మూడో సినిమా. అతడి మార్క్ సెన్సిబిలిటీ టీజర్ లో & విజయ్ దేవరకొండ చెప్పిన కవితలో స్పష్టంగా వినిపించింది, కనిపించింది కూడా. “యానిమల్ (Animal), పుష్ప 2” సినిమాల్లో ఆమె పాత్రలకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలతో సమానమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఆమె కెరీర్లో నటిస్తున్న మొట్టమొదటి ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాహుల్ భావిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి “ది గర్ల్ ఫ్రెండ్”తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ సొంతం చేసుకుంటదేమో చూడాలి. ఇకపోతే.. “ది గర్ల్ ఫ్రెండ్” అనంతరం రష్మికకు “కుబేరా (Kubera), చావా (Chhaava)” సినిమాలు కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. చూస్తుంటే.. రష్మిక రేంజ్ ప్యాన్ ఇండియన్ లెవల్లో పాతుకుపోయేలా ఉంది.