GOAT vs OG: విజయ్‌ ‘గోట్‌’లో ‘ఓజీ’ ప్రస్తావన.. ఎందుకిలా చేశారో?

రెండు సినిమాలకు ఒకే పేరు అనుకోవడం, ఒక్కోసారి పేరు పెట్టేయడం.. ఆ తర్వాత లేనిపోని బాధలు పడటం మనం చాలాసార్లు చూశాం. ఎందుకో కానీ ఇన్నేళ్లయినా అలాంటి పరిస్థితులు టాలీవుడ్‌లో వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సమస్య పూర్తి పేరు కానీ, సగం పేరు. అవును ఇటీవల విడుదలైన ‘ది గోట్‌’ సినిమాకు వెళ్లినవాళ్లు ఓపికగా చూసి ఎండ్‌ కార్డ్స్‌ చూసి ఉంటే ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది.

GOAT vs OG:

‘ది గోట్‌’ సినిమా క్లైమాక్స్ అయిపోయాక ఎండ్ టైటిల్స్ తర్వాత ఓ చిన్న సన్నివేశం చూపించారు. సినిమాలో విజయ్ (Thalapathy Vijay) పోషించిన నెగటివ్ పాత్రకు సంబంధించిన ట్విస్టుని రివీల్ చేశారు అందులో. అలా సినిమా కథ అక్కడితో అయిపోలేదనే హింట్ ఇచ్చింది టీమ్‌. అయితే ఆ సన్నివేశం తర్వాత సినిమా టీమ్‌ చూపించిన టైటిలే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ‘గోట్ వర్సెస్ ఓజీ’ (GOAT vs OG) అని కార్డు వేశారు.

అంతేకాదు ఆ సినిమాకు విక్రమ్‌ ప్రభు ((Venkat Prabhu) ) ట్రేడ్‌ మార్క్‌ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చారు. అదే ‘ఏ విక్రమ్ ప్రభు విలన్’. ఇప్పుడు తీసిన ‘ది గోట్‌’కు విక్రమ్‌ ప్రభు హీరో అని పెట్టిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ‘గోట్ వర్సెస్‌ ఓజీ’ (GOAT vs OG) అనేది ‘ది గోట్’ సినిమాకు సీక్వెల్. అయితే ఇక్కడ డౌట్‌ ఏంటి అంటే.. తెలుగులో ‘ఓజీ’ (OG Movie) అనే సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసినా ఎందుకు ఆ పేరే పెట్టారు అనేది.

‘ది గోట్‌’ సినిమాకు వచ్చిన ‘గ్రేట్‌’ ఫలితం నేపథ్యంలో ‘గోట్‌ వర్సెస్‌ ఓజీ’ (GOAT vs OG) సినిమా ఉంటుంది అని చెప్పడం కష్టమే. అయితే ‘ఓజీ’ అనే సినిమా ఉందని తెలిసాన కావాలనే పేరు పెట్టారు అంటూ ఓ చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. మరి టీమ్‌ ఎందుకిలా చేసింది, గోట్‌, ఓటీ అనేవి గొప్ప పదాలు కాబట్టి దానికి అదే సరిపోతుంది అని వాడరని కూడా కొందరు అంటున్నారు. మరి వెంకట్‌ ప్రభు మనసులో ఏముందో?

ట్వీటేసినంత మాత్రాన.. ఎన్టీఆర్ ని.. బాలయ్య దగ్గరకి తీసుకుంటాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus