Vikram: గొడవల్లో ఉన్న సినిమా గురించి రియాక్ట్‌ అయిన విక్రమ్‌.. ఏమన్నారంటే?

  • September 10, 2024 / 12:33 PM IST

ఒక సినిమాలో ఒక పాత్ర కోసం ప్రాణం ఇచ్చేయడానికి కూడా రెడీ అయ్యే నటులను ఎప్పుడైనా చూశారా? అంత సినిమా పిచ్చోడు ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు మన విక్రమ్‌. సినిమాలో గెటప్‌ అంటే.. ఏదో గెటప్‌ కాదు నిజం అలా మారిపోవాలి అనుకునే రకం ఆయన. ఆయన గెటప్‌లకు, వైవిధ్యమైన నటనకు సరైన ఎలివేషన్‌ ఇచ్చి భారీ విజయం అందించిన దర్శకుడు శంకర్‌ (Shankar) . ‘అపరిచితుడు’ సినిమాతో అది చేసి చూపించారు. ఆ సినిమాలో మూడు పాత్రలు చేసిన విక్రమ్‌కు (Vikram) ఇంకా ఆ పాత్రల ఆలోచనలు, ఇష్టం పోయినట్లు లేదు.

Vikram

ఆ సినిమా వచ్చి 19 ఏళ్లు అయినా ఇంకా ఆ సినిమా గురించి ఆయన ఆలోచిస్తున్నారు. అందుకేనేమో ఆ సినిమా రీమేక్‌కి సిద్ధమైన దర్శకుడు శంకర్‌ తననున ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న వేశారు. ఇంతకీ ఏమైందంటే.. ఆ మధ్య ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దాని గురించి విక్రమ్‌ (Vikram) దగ్గర మాట్లాడితేనే అలా మాట్లాడాడు. శంకర్‌ – విక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమా హిందీ రీమేక్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranaveer Singh) నటిస్తాడు అని ఆ మధ్య అనౌన్స్‌మెంట్‌ కూడా అయింది. ఈ విషయం గురించి విక్రమ్‌ దగ్గర ప్రస్తావిస్తే.. ‘అపరిచితుడు’ రీమేక్‌ గురించి శంకర్‌కు మాత్రమే తెలుసు. రీమేక్‌ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి అని నవ్వేశారు విక్రమ్‌ (Vikram). అయినా రణ్‌వీర్ సింగ్‌ ‘అపరిచితుడు’ రీమేక్‌లో అద్భుతంగా నటిస్తాడని నాకు నమ్మకముంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్‌ ఒకడు.

ఆయన్ని అపరిచితుడిగా చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వీలైనంత త్వరగా ఆ సినిమా రీమేక్‌ చూడాలని ఉంది అని విక్రమ్‌ (Vikram) చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా లీగల్‌ చిక్కుల్లో ఉన్న విషయం తెలిసిందే. ‘అపరిచితుడు’ రీమేక్‌ కోసం 2021లోనే సన్నాహాలు చేశారు. పెన్‌ స్టూడియోస్‌ జయంతిలాల్‌ గడ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మించనున్నట్లు చెప్పారు. అయితే, ఆ సినిమా ఆర్థిక అంశాలపై ఒరిజినల్‌ నిర్మాతలు కోర్టుకెక్కారు. అప్పటి నుండి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

కొత్త లుక్‌తో కిర్రెక్కిస్తున్న అవికా గోర్‌.. ఫొటోలు చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus