ఇప్పుడంటే లిప్ లాక్ అనేది ఎవ్వరికీ పెద్ద విడ్డూరం అనిపించడం లేదు. బోల్డ్ సీన్స్, బోల్డ్ రోల్స్ అంటూ చెప్పేసి చాలా క్యాజువల్ గా పెట్టేసుకుంటున్నారు. మరికొందరు కథలో ఆ పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి లిప్ లాక్ లు పెట్టక తప్పదు అంటున్నారు. మారుతున్న కాలంతో పాటు ఇవన్నీ తప్పవు.. అని ఎంతో మంది విశ్లేషకులు చెబుతూనే వస్తున్నారు. బాలీవుడ్ నుండీ సౌత్ కు పాకిన ఈ సంస్కృతి ఇప్పుడు అక్కడ సర్వసాధారణం అయిపోయింది.
అయితే తెలుగు సినిమాలన్నిటిలోనూ లిప్ లాక్ లు ఎక్కువ ఉండవు. కొన్ని కొన్ని సినిమాల్లో తప్ప. అయితే గతంలో ఈ లిప్ లాక్ లకు తెలుగు చిత్రంలో అస్సలు స్కోప్ లేదు. అదో పెద్ద విషయం అన్నట్టు అప్పటి రోజులు ఉండవు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇండియన్ స్క్రీన్ పై మొదటి లిప్ లాక్ ఏ సినిమాలో ఉంది? ఆ హీరో, హీరోయిన్లు ఎవరు అని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. నిజానికి ఇండియన్ స్క్రీన్ పై మొదటి లిప్ లాక్.. ‘కర్మ’ అనే సినిమాతో మొదలైంది. 1933లో ఈ చిత్రం విడుదలైంది.
ఇది ఒక హిందీ చిత్రం. దేవిక రాణి అనే హీరోయిన్ మొదటి లిప్ లాక్ పెట్టడానికి అంగీకరించింది. తన భర్తే హీరో కాబట్టి ఆమె అంగీకరించినట్టు తెలుస్తుంది. అతని పేరు హిమాన్షు రాయ్. ఇతను కూడా అప్పటి టాప్ హీరోనే. అప్పటికి వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. అటు తరువాత వివాహం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది.అలా ఇండియన్ స్క్రీన్ పై మొదటి లిప్ లాక్ దేవిక రాణి, హిమాన్షు రాయ్ లతో మొదలైందని చెప్పొచ్చు.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!