Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

‘కాంతార’ కన్నడలో ఇండస్ట్రీ హిట్ సినిమా. 2022 సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత.. అంటే దాదాపు 2 వారాలకు తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అంత లేట్ గా రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూస్తారన్న గ్యారంటీ ఉండదు. అయినప్పటికీ ‘కాంతార’ టీంకి మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 30న తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్'(పీఎస్ 1) వంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది.

Kantara Chapter 1

పైగా అది పాన్ ఇండియా సినిమా. దాని ప్రమోషన్స్ ముందు ‘కాంతార’ అస్సలు కనిపించలేదు అనే చెప్పాలి. అందుకే కొంచెం టైం తీసుకుని మిగతా భాషల్లోకి వదిలారు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేసింది లేదు. అయినా సరే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సినిమా తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. హిందీలో కూడా రూ.100 కోట్ల పైనే వసూళ్లు సాధించింది.

‘కాంతార’ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం.. ఆ సినిమాలో దైవత్వంతో పాటు ఓ హారర్ టచ్ కూడా ఉంటుంది. దానికి తోడు క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. అందువల్ల ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది ‘కాంతార’. అయితే దీనికి ప్రీక్వెల్ గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ మాత్రం ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోతుంది. ఎందుకంటే ముందుగా ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ అంత ఇంప్రెసివ్ గా లేదు. ‘ ‘పొన్నియన్ సెల్వన్’ లా ఉంది.. ‘కాంతార’ లో ఉన్న రూటెడ్ ఎమోషన్స్ ఇందులో కనిపించడం లేదు’ అంటూ ఆడియన్స్ పెదవి విరిచారు.

అందుకే ఈ సినిమాపై బజ్ తీసుకురావడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి.. ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ప్రమోషన్ చేశారు. అంతేకాకుండా ఒక రోజు ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇటీవల కాలంలో సినిమాకి హైప్ ఉన్నా.. లేకపోయినా ప్రీమియర్స్ కనుక వేస్తున్నారు అంటే.. వాటికి ఉండే క్రేజ్ వేరు. హైప్ లేని సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. అవి బాగా ప్లస్ అవుతాయి. లేదు అంటే.. ప్రీమియర్స్ మైనస్ కూడా అవుతాయి. మరోపక్క టాక్ తో సంబంధం లేకుండా బుకింగ్స్ బాగా జరుగుతాయి. అది మేటర్. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’ టీం అయితే ఈ రిస్క్ తీసుకుంటుంది. మరి వాళ్ళకి అవి ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.

ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus