Sudipto Sen: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దర్శకుడికి అస్వస్థత..!

‘ది కేరళ స్టోరీ’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ సినిమా రిలీజ్ టైంకి ముందు నుండి ప్రమోషన్స్, సక్సెస్ మీట్ల.. హడావిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో ఆయనని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుదీప్తో సేన్ బాగానే ఉన్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. టెస్టులు అన్నీ చేశాకే ఈ విషయం చెబుతున్నట్టు, కంగారు పడాల్సిన పనిలేదని వారు అంటున్నారు.

ఇక తన ఆరోగ్యం గురించి స్వయంగా సుదీప్తో సేన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆయన ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ సమస్యలతో కోకిలాబెన్ ఆసుపత్రిలో నేను చేరాను. ఇప్పుడంతా బాగానే ఉంది, కంట్రోల్లోనే ఉంది. ఈ రోజే నేను డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.నేను కూడా ‘నన్ను ఇంటికి పంపించేయండి’ అని డాక్టర్లను అడుగుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక (Sudipto Sen) సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ స్టోరీ సినిమాలో అదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అనేక వివాదాలకు దారి తీసింది. విడుదలవ్వకుండా బ్యాన్ చేసే స్థాయికి కూడా వెళ్ళింది పరిస్థితి. ‘కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారు అనే థీమ్ తో ఈ సినిమా రూపొందింది. ఆల్రెడీ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కూడా సాధించింది ఈ చిత్రం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus