రీసెంట్ టైమ్స్‌లో చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కొన్ని నెలల క్రితం వివాదాల మధ్య చిన్నపాటి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మే 5న విడుదలవ్వడానికి సిద్ధమైంది. దీంతో చర్చ మొదలై, రచ్చగా మారింది. ఇప్పుడు రచ్చకెక్కిన చర్చ విదేశాలకు వెళ్లబోతోంది. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విదేశాల్లో విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.
‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేయగా, కొన్ని రాష్ట్రాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీని ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఈ సినిమా తీసుకొచ్చిన రచ్చ తేలకముందే విదేశాలకు వెళ్తోంది. దీంతో అక్కడ ఏమవుతుందో అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.56 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. విదేశీ గడ్డ మీద ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే.. మే 12న 37 దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అదా శర్మ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఇంతకీ వివాదం ఏంటనేది చెప్పలేదుగా.. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో సినిమాను రూపొందించారు.
నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అలా వారు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో మన దేశంలో వివిధ వర్గాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. కొందరేమో కేరళలో అలా జరగలేదని అంటుంటే, 32 వేల మంది అమ్మాయిలు కాదని మరికొందరు అంటున్నారు. మరి విదేశాల్లో ఇంకెలాంటి చర్చ రేగుతుందో చూడాలి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?