సాహిత్యంలో ఎన్నో పదాలతో మ్యాజిక్ క్రియేట్ చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గౌరవం. చిన్న స్థాయి హీరోల నుంచి అగ్ర హీరోల వరకు ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కల్మషం లేని మనిషి గా ప్రతి పాట తో కూడా ఎన్నో మంచి అర్ధాలను అందించారు. అలాంటి మంచి రచయిత మరణించడంతో ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. సిరివెన్నెల తో మొదలైన సీతారామశాస్త్రి ప్రయాణం దాదాపు 3000 కు పైగా పాటలతో ఎంతో అద్భుతంగా కొనసాగింది.
దాదాపు ఎనిమిది వందల సినిమాలకు ఆయన పని చేశారు. నేటి తరం యువ హీరోలు యువ దర్శకులు చాలామంది కూడా సీతారామశాస్త్రి తో పని చేయడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరిసారిగా నాని సినిమాకు పాటలను అందించారు.నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు రాహుల్ ఈ సినిమాలోని రెండు ప్రత్యేకమైన పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో రాయించాలి అని మొదటి నుంచి అందరితో చెప్పుకుంటూ వచ్చాడు.
ఇక ఇటీవల ఆ రెండు పాటలు కూడా ఎంతో అద్భుతంగా రచించే కంపోజింగ్ పూర్తి అయ్యే వరకు కూడా అడిగి తెలుసుకున్నారు. మరి కొందరు దర్శకులు కూడా సిరివెన్నెల తో కలిసి పని చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో అందరు కూడా మనోవేదనకు గురి అవుతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?