Arul Saravanan: యాక్షన్ రొమాంటిక్ జానర్ లో శరవణన్ తదుపరి చిత్రం!

వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ పేరు గురించి పరిచయం అవసరం లేదు చెన్నైలో ఈయనకు సంబంధించిన ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇలా పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకి నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో ఏకంగా 50 సంవత్సరాల వయసులో మొహానికి రంగు వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. శరవణన్ నిర్మాణంలో ది లెజెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈయన 50 సంవత్సరాల వయసులో నటించినటువంటి మొదటి సినిమాని ఏదో చేయాలన్న ఉద్దేశంతో కాకుండా భారీ బడ్జెట్ తో ఏకంగా 60 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో ఈయన సరసన ఊర్వశి రౌతెల హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో శరవణన్ సరసన ఊర్వశి నటించిన కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమా తన షాపింగ్ మాల్స్ కి భారీగా ప్రమోషన్లకు ఉపయోగపడిందని మాత్రం చెప్పాలి.ఇలా మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ ఈయన రెండవ సినిమాని చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కోలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

అరుళ్ కొత్త మూవీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈయన ప్రకటించారు.ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ మొదటి సినిమాకి 60 కోట్లు ఖర్చు చేసిన రెండవ సినిమాకి మరెన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus