#SSMB29 కాన్సెప్ట్ వెనుక ‘లవ్ మౌళి’ దర్శకుడి హస్తం.. ఎవ్వరూ ఊహించలేదు

నవదీప్ (Navdeep Pallapolu) హీరోగా రూపొందిన ‘లవ్ మౌళి’ (Love Mouli) సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతోంది. అవ‌నీంద్ర (Avaneendra)  ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చాలా మందికి ఇతని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతని పాన్ ఇండియా సినిమాలకి వర్క్ చేశాడు. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అవును వివరాల్లోకి వెళితే.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాలకి ఇతను రైటర్ గా పనిచేశాడు. విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) , కాంచి..లకి చాలా ఇష్టమైన రైటర్ కూడా.

అయితే ‘లవ్ మౌళి’ అనే గ్లామర్ మూవీ డైరెక్ట్ చేశాడు కాబట్టి.. ‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాల ఛాయలు లేవు కాబట్టి… ప్రేక్షకుల అటెన్షన్ ఇతని వైపు మళ్ళలేదు. ఈ సినిమా చేసినందుకు విజయేంద్రప్రసాద్, కాంచి..లు ఇతన్ని తిట్టిపోశారట. కానీ ఒకే కూర ఎన్ని రోజులు అని తింటాం అని భావించి తన కవి హృదయం సంతృప్తి కొరకు.. ‘లవ్ మౌళి’ అనే సినిమాని తీసినట్టు అవ‌నీంద్ర చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. రాజమౌళి (S. S. Rajamouli) , మహేష్ బాబు (Mahesh Babu) ..ల సినిమా స్టోరీ ఐడియా కూడా ఇతనే ఇచ్చాడట. మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా అని రాజమౌళి అనుకున్నప్పుడు తన టీంతో.. ‘ ‘కౌబాయ్’ ‘జేమ్స్ బాండ్’ ‘ ఈ రెండు జోనర్స్ లో మహేష్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాను. ఏదైతే బెటర్ చెప్పండి అని’..రాజమౌళి తన టీంని అడిగాడట.

అందుకు అందరూ ‘కౌబాయ్’ జోనర్లో సినిమా చేయమని చెప్పారట. కానీ అవనీంద్ర మాత్రం ‘ ‘కౌబాయ్’ జోనర్లో ఆయన ఆల్రెడీ సినిమా చేసేశాడు. కాబట్టి ఇప్పుడు చేసి వేస్ట్..! ఏదైనా అడ్వెంచర్ సినిమా చేస్తే బెటర్ అండి.వి.ఎఫ్.ఎక్స్ అదీ అందుబాటులో ఉంది కదా’ అని చెప్పాడట. ఫైనల్ గా అతను చెప్పిన లైన్ నే రాజమౌళి ఫైనల్ చేసినట్లు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus