మంచు వారి కుటుంబంలో చాలా కాలం నుండి గొడవలు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు రోడ్డుకెక్కాయి. మనోజ్(Manchu Manoj) ,అతని భార్య మౌనిక నుండి తమకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు (Mohan Babu) తన పలుకుబడి ఉపయోగించి కేసు పెట్టాడు. ఇక మంచు మనోజ్ తన మెడికల్ రిపోర్ట్ తో మోహన్ బాబు, మంచు విష్ణు (Manchu Vishnu)..లపై కేసు పెట్టాడు.మంచు విష్ణు అయితే మనోజ్ ఇంటి సీసీ కెమెరాని తీయించేసి స్వాధీనం చేసుకోవడం కూడా గమనించదగ్గ విషయం.
అయితే ఈ గొడవల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి (Vijay Maheshwari) . నిన్న మొన్నటి వరకు అసలు ఎవరికీ తెలియని వ్యక్తి.. అసలు మంచు వారి ఆస్తుల గొడవల్లో చిచ్చు పెట్టేంతలా వారికి ఎలా క్లోజ్ అయ్యాడు? అనే ప్రశ్న అందరి మైండ్లో మెదులుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. “వినయ్ మహేశ్వరి… మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని తెలుస్తుంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఇతని పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇతను చర్చనీయాంశం అయ్యాడు.
ఆస్తుల పంపకాల టైంలో ఇతనిపై మంచు మనోజ్ చేయి చేసుకున్నట్టు కూడా కథనాలు వినిపించాయి. అంతేకాదు మోహన్ బాబు యూనివర్సిటీలోని అక్రమాల విషయంలో కూడా ఇతని హ్యాండ్ ఉందని అంటున్నారు. అంతకు ముందు ఓ పాపులర్ మీడియా గ్రూప్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా వినయ్ మహేశ్వరి పనిచేశారట.
ఇక మంచు ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చాక వీరి న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, వంటి సంస్థలకి సీఈఓ గా పనిచేస్తున్నాడట వినయ్. ఇక మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డికి కూడా వినయ్ దూరపు బంధువు అవుతాడట. ఆ రిఫరెన్స్ తోనే మంచు ఫ్యామిలీలోకి అతను ఎంట్రీ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.