సరిగ్గా గమనిస్తే…..ఈ నెల అదే….ఫిబ్రవరి నెల టాలీవుడ్ ప్రేక్షకులకు పండగ అనే చెప్పాలి…ఫిల్మ్ లవర్స్ ఎంజాయ్ చేసే సినిమాలు ఈ నెల వస్తున్నాయి అని తెలుస్తుంది….డేట్స్ ప్రాబ్లమ్ వల్లనో, లేకపోతే ఇతరత్రా కారణాల వల్ల కాస్త వెనుక బడిన సినిమాలు అన్నీ ఫెబ్ లో రంగంలో లోకి దిగుతున్నాయి….ఇంతకీ ఈ నెల ఏ సినిమాలు వస్తున్నాయి…ఎలాంటి జొనర్ లో వస్తున్నాయి అంటే…ఈ కధ చదవాల్సిందే. మరో రెండు రోజుల్లో అంటే వచ్చే మొదటి శుక్రవారం…’నేను లోకల్’.. ‘లక్ష్మీ బాంబ్’.. ‘కనుపాప’ చిత్రాలు థియేటర్స్ ను తాకనున్నాయి…అందులో నాని మూవీ నేను లోకల్ రొమాంటిక్ ఎంటర్టెయినర్. ఇక మన మంచు లక్ష్మి నటించిన లక్ష్మీ బాంబ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ, కామెడీ టచ్ ఉన్న ఫ్యాంటెసీ మూవీ…అదే క్రమంలో మలయాళ మూవీ ఒప్పంను తెలుగులో కనుపాప పేరుతో విడుదల చేస్తున్నారు…గుడ్డివాడిగా మోహన్ లాల్ నటన.. ప్రియదర్శన్ దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంటాయనే అనిపిస్తుంది…ఇక రెండో శుక్రవారం అంటే ఫెబ్ 9న సూర్య నటించిన ‘సింగం3’ రిలీజ్ కానుంది.
ఇది పక్కా మాస్ జోనర్ కమర్షియల్ కాగా.. ఆ మరుసటి రోజే అక్కినేని నాగార్జున నటించిన భక్తి చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదలవుతోంది. ఇక ఒక్క రోజు గ్యాప్ తో ఫిబ్రవరి 10న అంజలి నటించిన హారర్ థ్రిల్లర్ ‘చిత్రాంగద’ కూడా విడుదల కానుంది. ఇక మూడోవ వారం….అంటే ఫెబ్17న రాజ్ తరుణ్-అను ఇమాన్యుయేల్ నటించిన కామెడీ చిత్రం ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ విడులవుతోంది. ఇది కూడా పూరీ కామెడీతో కూడిన చిత్రం. మంచు మనోజ్ నటించిన మాస్ మసాలా మూవీ ‘గుంటూరోడు’ని కూడా ఇదే రోజు విడుదల అవుతున్నట్లు టాక్. మరోవైపు ‘ఘాజీ’ అంటూ దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు రానా దగ్గుబాటి-తాప్సీ పన్ను. ఇక చివరి శుక్రవారం అదే ఫిబ్రవరి 24న సాయి ధరం తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన ‘విన్నర్’ విడుదల అవుతోంది. మొత్తంగా చూసుకుంటే ఫెబ్ నెల అన్నీ జొనర్స్ సినిమాలకు కవర్ చేసింది అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.