Pushpa2: అనుకున్నదే అయ్యింది.. నెక్స్ట్‌ ‘పుష్ప’ అతనే!

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే.. నాయకుడిని మోసం చేసే శిష్యుడు ఒకడు కచ్చితంగా ఉంటాడు. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా అంటే.. ఇలానే ఉన్నాయి, ఉంటాయి కూడా. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా కూడా ఇలానే ఉంటుందా? ఏమో తొలి పార్టు చూస్తే.. అలాంటిదేం కనిపించలేదు అంటారా? తొలి పార్ట్‌ సంగతి పక్కనపెడితే.. రెండో పార్టులో మాత్రం అలాంటి సీన్‌ ఒకటి ఉంటుంది అని అంటున్నారు. ‘పుష్ప’రాజ్‌ శిష్యుడు కేశవే ఆ శిష్యుడు అని టాక్‌.

‘పుష్ప ది రైజ్‌’లో చూసుకుంటే.. ఒకరి దగ్గర పని చేస్తూ.. పుష్ప యాటిట్యూడ్‌ చూసి మెచ్చి వచ్చేశాడు. నీతోనే నా జీవితం అంటూ.. వెంటే తిరుగుతాడు. అయితే.. ఈ పాత్రకో మెలిక ఉందని, రెండో పార్టులో మెయిన్‌ అవ్వబోతున్నాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో కేశవ.. అచ్చం పుష్పలా కనిపిస్తున్నాడు. ఆ లుక్‌, హెయిర్ కట్‌, మెడలో గొలుసు, చొక్కా… మొత్తంగ కేశవ పుష్పలా మారిపోయాడు.

అయితే ఈ ట్రాన్ఫామేషన్‌ సినిమా ఆఖరులో జరుగుతుందా? లేక సినిమా మధ్యలో ఇంటర్వెల్‌కే కేశవ.. ఇలా మారిపోయి పుష్పకు షాక్‌ ఇస్తాడా అనేది తెలియడం లేదు. ఇలాంటి సినిమాల్లో అయినవాడు షాక్‌లు ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. ‘నేను నాయకుడు వెనుక ఉండటం కాదు.. నేనే నాయకుణ్ని’ అనుకుంటూ ఉంటారు. లేదంటే సినిమా ఆఖరులో పుష్ప మంచి వాడు అయిపోతే.. కేశవ మాత్రం రూటు మార్చకుండా ‘నేనే పుష్ప’ అంటాడేమో చూడాలి.

ఏదైనా సినిమాలో ట్విస్టులు అంటే.. లెక్కల మాస్టారూ సుకుమార్‌ అదరగొట్టేస్తుంటారు. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలోనూ అలానే ఆలోచించి ఉంటారు. అయితే సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియడం లేదు. ఇటీవల షూటింగ్‌ ప్రారంభం అన్నారు తప్ప.. ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు. ఇప్పుడు లుక్‌ టెస్ట్‌లు జరుగుతున్నట్లున్నాయి. త్వరలోనే షూటింగ్‌పై క్లారిటీ రావొచ్చు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus