రష్మిక, రక్షిత్ నిశ్చితార్థం రద్దుకావడం వెనుక వ్యక్తి ఎవరంటే ?

“ఛలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రష్మిక… “గీత గోవిందం” సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ అయి వందకోట్లను కొల్లగొట్టింది. ఆమె కెరీర్ పరంగా ఇది సంతోషకరమైన విషయం అయితే.. పర్సనల్ లైఫ్ లో ఓ బాధాకర సంఘటన జరిగింది. అదే నిశ్చితార్థం రద్దుకావడం. రష్మిక, కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి కలిసి కన్నడలో ‘కిరిక్‌ పార్టీ’ సినిమాలో నటించారు. ఈ మూవీ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2017లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి.

నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. దీనికి గల కారణం ఆరా తీస్తే అసలు విషయం బయటిపడింది. గొడవలకు కారణం మేనేజర్ అని తెలిసింది. రష్మికతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కెరీర్ విషయంలో ఆమెకు పూర్తిగా రక్షిత్ శెట్టి స్వేచ్ఛను ఇచ్చారు. రెండు సినిమాలు హిట్ కావడంతో రష్మికకు స్వయంగా మేనేజర్‌ను రక్షిత్ ఏర్పాటు చేశారట. మేనేజర్ తీరు రష్మికకి నచ్చకపోవడం, రక్షిత్ అతనికే మద్దతు తెలుపడం వారి మధ్య దూరం పెరగడానికి కారణమైందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. రక్షిత్ నియమించిన మేనేజర్‌ను రష్మిక తొలగించడంతో ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయని వెల్లడించారు. దీంతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని అటు కన్నడ పరిశ్రమ, ఇటు తెలుగు పరిశ్రమకి చెందినవారు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus