Sukumar: సుకుమార్‌ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే.. ఇమిటేట్‌ చేసి మరీ..!

లెక్కల మాస్టారు సుకుమార్‌.. ఇప్పుడు స్టార్‌ డైరక్టర్‌ సుకుమార్‌ అయ్యారు. దీని వెనుక ఆయన కష్టం, తీసిన సినిమాలు ఉన్నాయి. అయితే డైరెక్షన్‌ వైపు ఆయన రావడానికి కారణం ఓ స్టార్‌ హీరో. అవును ఆయనే రాజశేఖర్‌. ఆయనకు సుకుమార్‌ వీరాభిమాని. ఆ విషయాన్ని సుకుమార్‌ ఓ సందర్భంలో చెప్పారు కూడా. సుకుమార్‌ చిన్నతనంలో రాజశేఖర్‌ను బాగా ఇమిటేట్‌ కూడా చేసేవారట.

Sukumar

రాజశేఖర్‌కు నటించిన ‘ఆహుతి’, ‘ఆగ్రహం’, ‘అంకుశం’, ‘తలంబ్రాలు’, ‘మగాడు’ లాంటి ఎన్నో సినిమాల్ని సుకుమార్‌ తెగ చూశారట. ఆ సినిమాలే తనను బాగా ప్రభావితం చేశాయని సుకుమార్‌ చెబుతుంటారు. స్కూలు, కాలేజీ రోజుల్లో రాజశేఖర్‌ ఇమిటేట్‌ చేస్తుంటే.. అందరూ ‘వన్స్‌మోర్‌’ అనేవారట. సినిమాల్లోకి వెళ్లి, ఏదైనా చేయగలననే నమ్మకం అలా కలిగింది అని సుకుమార్‌ చెప్పారు.

అంతగా అభిమానించిన రాజశేఖర్‌తో ఇప్పటివరకు సుకుమార్‌ సినిమా అయితే చేయలేదు. ఒకవేళ చేస్తే ఆయన్ను ఎలా చూపిస్తారు అనే ఆతృత అయితే అభిమానుల్లో ఇప్పటికీ అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం హీరోగా రాజశేఖర్‌ చేసి, సుకుమార్‌ డైరక్ట్‌ చేసే పరిస్థితి లేదు. ఈ లెక్కన విలన్‌గా కానీ, ఏదైనా కీలక పాత్రలో నటింపజేసే ఆలోచన అయితే చేయొచ్చు.

ఇక సుకుమార్‌ సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప: ది రూల్‌’తో చరిత్ర సృష్టించిన ఆయన తన తర్వాతి సినిమాగా రామ్‌చరణ్‌తో చేయనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు RC17 రానుందని నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టింది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాతనే సుకుమార్‌ సినిమా ఉంటోంది.

ఇక ఈ సినిమకు సంబంధించి రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను ఇప్పటికే షూట్‌ చేసేశారు. అది అద్భుతంగా వచ్చింది అని కూడా చెబుతున్నారు. రాజమౌళి కూడా ఈ మాట చెప్పారు. ఆ వీడియోతోనే సినిమాను అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

మరోసారి ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. ఆయనే చెప్పాడంటే కచ్చితంగా నమ్మాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus