ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్న చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో వింటూ వస్తున్నాం. దానికి ప్రభాస్ ఎప్పుడూ ఓ నవ్వు నవ్వేసి ఊరుకుంటున్నాడు. ఆయనతో కలసి నటించే హీరోయిన్‌తో ప్రేమలు కట్టేసే పరిస్థితీ లేదు. ఆ హీరోయినో ఆమె సన్నిహితుల్లో లేనిపోని లీకులు ఇచ్చి ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ బయటకు రావడం తప్ప.. ప్రభాస్ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. దీనికి కారణం రామ్‌చరణ్.
ప్రభాస్ – రామ్‌చరణ్ చాలా మంచి స్నేహితులు. కృష్ణంరాజు – చిరంజీవి లాగే వీళ్లూ స్నేహితులు అనే విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కి రామ్‌చరణ్ వచ్చాడు. రెండు ముక్కలు చేసి రెండో ఎపిసోడ్‌ను 14వ తేదీన టెలీకాస్ట్ చేస్తారు. ఆ ఎపిసోడ్‌లో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ ఆసక్తికర సమాచారం ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నాడని రామ్‌చరణ్ ఆ కార్యక్రమంలో చెప్పాడట.
ఇప్పటికే స్ట్రీమ్ అవుతున్న తొలి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్లీంకార పుట్టినప్పుడు ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని, షూటింగ్ ఉన్నా, లేకపోయినా ఉదయం రెండు గంటలపాటు పాపతో ఆడుకుంటా అని చెప్పాడు. క్లీంకార ఎప్పుడూ అమ్మ.. అమ్మ అని అనడమే తప్ప నాన్న అని పిలవడం లేదని, నాన్న అని అనగానే ఫేస్ చూపిస్తా అని చెప్పాడు. దీంతోపాటు చాలా విషయాలు చెప్పాడు.
ఇక రెండో ఎపిసోడ్‌లో రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇక చరణ్ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది. ఇక ప్రభాస్ సినిమాల సంగతి చూస్తే.. ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్), ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ ఉన్నాయి. ఇవి కాకుండా లోకేశ్ కనగరాజ్ సినిమా ఒకటి అనౌన్స్ చేస్తారని టాక్.