Adipurush: ‘ఆదిపురుష్’ ‏టీజర్లో హనుమంతుడిగా కనిపించిన వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు..!

ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆదిపురుష్’. చాలా కాలంగా ఈ చిత్రం టీజర్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు.అందరి ఎదురుచూపులకు తెర దించుతూ ఆదివారం సాయంత్రం నాడు అయోధ్యలోని సరయు నది తీరాన ఈ చిత్రం టీజర్ లాంచ్ జరిగింది.టీజర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లో ఉంది. కానీ టీజర్ కు మిశ్రమ స్పందన లభించింది.

ప్రభాస్ వంటి హీరోతో ఈ మోషన్ క్యాప్చర్ మూవీ తీయడం ఏంటి అంటూ అందరూ మండిపడుతున్నారు. గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు, ‘బ్రహ్మాస్త్ర’ కంటే కూడా ఘోరంగా ఉన్నాయి అని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఈ టీజర్లో హనుమంతుడు రోల్ కూడా హైలెట్ గా నిలిచింది. ఈ పాత్రని పోషించింది ఎవరు అనే విషయం పై దర్శకుడు ఓం రౌత్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే… ఈ పాత్రలో నటించిన నటుడు పేరు దేవదత్త గజానన్ నాగే అని తెలుస్తుంది.పలు మరాఠీ సీరియల్స్, సినిమాల ద్వారా ఇతను బాగా పాపులర్ అయ్యాడు.జై మల్హర్ అనే సీరియల్లో లార్డ్ ఖండోబా పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాల్లో కూడా నటించాడు.

ఇప్పుడు ‘ఆదిపురుష్’ లో హనుమంతుడి పాత్రని పోషిస్తున్నాడు. సినిమాలో ఇతని పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువని టీజర్ స్పష్టం చేసింది. ‘ ‘ఆదిపురుష్’ చిత్రంలో హనుమంతుడిగా నటించడం చాలా సంతోషాన్నిచ్చిందని , ఈ పాత్ర కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు’ దేవదత్తా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus