మిస్టర్ కెకె విడుదలకు వారం ముందు ఆన్లైన్ లో సరికొత్త వెర్షన్

  • July 15, 2019 / 11:58 AM IST

“స్వామి” లాంటి డిజాస్టర్ అనంతరం విక్రమ్ నటించగా తెలుగు-తమిళ భాషల్లో విడుదలవుతున్న చిత్రం “మిస్టర్ కెకె”. విక్రమ్ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రానికి “చీకటి రాజ్యం” ఫేమ్ రాజేష్ సెల్వ దర్శకుడు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన రెండో కుమార్తె అక్షర హాసన్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. సినిమా టీజర్ & ట్రైలర్ తోపాటు విక్రమ్ లుక్స్ కూడా మంచి ట్రెండీగా ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమా అప్పుడెప్పుడో 2010లో వచ్చిన “పాయింట్ బ్లాంక్” అనే హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అని తెలియడంతో కాస్త నిరాశపడ్డారు.

పోనీలే రీమేక్ అయితే ఏంటీ అప్పుడెప్పుడో వచ్చింది కదా అని తమాయించుకొనేలోపు.. “నెట్ ఫ్లిక్స్” సంస్థ ఆ “పాయింట్ బ్లాంక్”కి రీమేక్ గా అదే పేరుతో కొత్త యాక్టర్లతో మరో చిత్రాన్ని నిర్మించి ఇప్పుడు ఆన్ లైన్ లో పెట్టింది. ఆ సినిమా చూస్తే “మిస్టర్ కెకె” చూసినట్లే ఉంటుంది. నెట్ ఫ్లిస్క్ లో 2019 వెర్షన్ చూసినవాళ్లందరికీ ఆల్రెడీ “మిస్టర్ కెకె” కథ-కథాంశం తెలుసు కాబట్టి దర్శకుడు రాజేష్ సెల్వ భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు చేస్తే తప్పితే ఈ చిత్రం మన ఆడియన్స్ ను ఆకట్టుకోవడం అనేది జరగదు. లేదంటే.. పాపం విక్రమ్ కష్టం మళ్ళీ ఆన్లైన్ లో పోసిన పన్నీరులా మారుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus