Chiranjeevi: అలా మెగాస్టార్ స్పెషల్ డ్యాన్సర్ అయ్యారట!

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చిరంజీవి వేసే డ్యాన్స్ స్టెప్పుల గురించి నెటిజన్లు సైతం అదుర్స్, సూపర్ అని కామెంట్లు చేస్తారు. టాలీవుడ్ యంగ్ హీరోలలో చాలామంది చిరంజీవి డ్యాన్స్ ను పలు సందర్భాల్లో ప్రశంసించారు. చిరంజీవి డ్యాన్స్ లో కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు డ్యాన్స్ ద్వారానే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే చిరంజీవి తనకంటూ ప్రత్యేకత ఉండే విధంగా డ్యాన్స్ చేయడానికి మాత్రం వెంకన్న బాబు అనే వ్యక్తి కారణం.

చిరంజీవి 5వ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఒక పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులు చూసి సెట్ లో ఉన్నవాళ్లంతా క్లాప్స్ కొట్టారు. అయితే ఆ సినిమా మేనేజర్ వెంకన్న బాబు మాత్రం డ్యాన్సర్లు ఏం చేశావో నువ్వు కూడా అదే చేశావని నీ ప్రత్యేకత ఏమిటని చిరంజీవిని ప్రశ్నించారు. ఆ తర్వాత తాను పాటను ఆస్వాదిస్తూ ఎలా డ్యాన్స్ చేయాలో నేర్చుకున్నానని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అప్పటినుంచి డ్యాన్స్ లో తన మార్కు చూపిస్తూ సినీ అభిమానులను చిరంజీవి ఆకట్టుకున్నారు.

ఆచార్య సినిమాలోని లాహే లాహే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus