2025 జనవరి అంటే సంక్రాంతి టైం నుండి సమ్మర్ వరకు పెద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వస్తుంది. దీంతో పాటు వెంకటేష్(Venkatesh) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలు అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) కూడా సందడి చేయనుంది. అటు తర్వాత సమ్మర్ కి అంటే ఏప్రిల్ 10కి ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) మే 9కి విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ సినిమాల ‘ది రాజాసాబ్’ ‘విశ్వంభర’ సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ త్వరలోనే ఫినిష్ అవుతుంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుందట. అది కంప్లీట్ అవ్వాలంటే 3 నెలల వరకు టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా చూసుకుంటే.. ‘ది రాజాసాబ్’ సినిమా ఏప్రిల్ 10 కి రాకపోవచ్చు.
అందుకే ఆ రిలీజ్ డేట్ కి ‘విశ్వంభర’ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు ‘పీపుల్ మీడియా’ వారితో టచ్ లో ఉన్నారట. వాస్తవానికి ‘విశ్వంభర’ సినిమా 2024 సంక్రాంతికే రావాలి. కానీ అనుకున్న టైంకి వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మే 9 కి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ‘ది రాజాసాబ్’ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ‘విశ్వంభర’ ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.