పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ‘సలార్’ (Salaar) తో చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.దాని వల్ల అతనికి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో అతని ‘గోట్ లైఫ్: ఆడు జీవితం’ (The Goat Life) సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ డీసెంట్ వసూళ్లు సాధిస్తుంది. మలయాళంలో అయితే కుమ్మేస్తుంది.
ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాడు అతను. టెక్నికల్ టీం కూడా చాలా బాగా కష్టపడింది. అయితే ఇది 2008లో వచ్చిన ‘గోట్ డేస్: ఆడు జీవితం’ అనే నవల ఆధారంగా రూపొందింది. మలయాళ రైటర్ బెన్యామిన్ ఈ నవలను రచించారు. ‘జైలు, ఎడారి, తప్పించుకోవడం, తిరస్కరణ’ వంటి 4 భాగాలుగా ఈ నవల రూపొందింది.
అలాగే ఈ నవల కేరళకు చెందిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా బెన్యామీను రచించడం జరిగింది. నజీబ్ మహమ్మద్ కుటుంబానికి మంచి ఆదాయం కోసం అతని భార్య 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలకు వలస కూలీగా వెళ్లాడు.వలస కూలీగా వెళ్లిన నజీబ్ మహమ్మద్ బానిసగా మారిపోతాడు. దానినే ఈ సినిమాలో వివరంగా చూపించారు. ఇప్పుడు నజీబ్ మహమ్మద్ ఫోటోలు అలాగే అతని ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.