Sreeleela: ఆ స్టార్ హీరోకి శ్రీలీల వరసకు ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ ముద్దుగుమ్మ శ్రీలీల. అమెరికాలో పుట్టి బెంగుళూరులో పెరిగింది శ్రీలీల. చదివింది డాక్టరైనా యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్టుతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కన్నడ ఇండస్ట్రీలో కిస్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ఆ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దృష్టి పడి పెళ్లి సందడి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ టాలీవుడ్ క్రష్ అయిపోయింది. ఆ వెంటనే వచ్చిన ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాకుండా చేసుకుంది.

దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతంఅమ్మడి చేతిలో దాదాపు 10క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అటు యంగ్ హీరోల దగ్గరనుంచి సీనియర్ల వరకు అమ్మడే ఫస్ట్ ఛాయిస్. ప్రస్తుతం శ్రీలీల.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. కేజీఎఫ్ ఫేమ్ యష్ శ్రీలీలకు బావ అవుతాడట.. అవును మీరు వింటున్న వార్త నిజమే.. ఏంటి యష్, శ్రీలీల కుటుంబాల మధ్య ఎలా సంబంధం కుదిరిందని ఆలోచిస్తున్నారా..

అవును ఈ విషయాన్ని శ్రీలీలే (Sreeleela) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శ్రీ‌లీల త‌ల్లి స్వర్ణలత బెంగళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్. ఆమెకు వైద్య రంగంలో అక్కడ చాలా పేరుంది. తాను ప్రముఖ బిజినెస్ మాన్ సూరపనేని శుభాకరరావును పెళ్లి చేసుకున్నారు. అనంతరం తనతో ఆమెరికాలో సెటిల్ అయింది. శ్రీ‌లీల పుట్టిన త‌ర్వాత స్వర్ణలత భర్తతో విబేధాలు వచ్చి విడాకులు ఇచ్చి బెంగుళూరుకు కూతురు శ్రీలీలతో వచ్చేసింది.

తన వైద్య వృత్తిని కొనసాగిస్తూ.. గైనకాలజిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే యష్ భార్య గురించి తెలుసు కాదా.. తన భార్య పేరు రాధిక పండిత్.. తను గర్భిణిగా ఉన్న సమయంలో స్వర్ణలతే వైద్య పరీక్షలు చేసి డెలివరీ చేశారట. అంతే కాకుండా ఈ క్రమంలోనే వారిమధ్య స‌న్నిహితం ఏర్ప‌డిందట. అప్పటి నుంచి రాధికను అక్కా అని యష్ ను బావ అని శ్రీలీల పిలుస్తుందట. ఇలా యష్ శ్రీలీలకు బావ అయిపోయాడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus