Adipurush: ‘ఆదిపురుష్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. కరెక్ట్ ప్లానింగే..!

2023 సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో ‘ఆదిపురుష్‌’ కూడా ఉన్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మొదట ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆ టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. మేకర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్టు మేకర్స్ ఇంకా ప్రకటించలేదు కానీ బయ్యర్స్ మాత్రం అది నిజమే అని తేల్చేశారు. 2023 సమ్మర్ కు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి అని..

అందులో ‘ఆదిపురుష్’ కూడా ఉండడంతో ప్రభాస్ అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ పోస్ట్ పోన్ అయినట్టు కథనాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.సంక్రాంతి సీజన్ లో ఇలాంటి మైథలాజికల్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు. పైగా టీజర్ కూడా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన టీజర్ ను చూస్తే ఇది వట్టి బొమ్మల సినిమాలా ఉంది అనే విమర్శలు వెల్లువెత్తాయి.

పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక కూడా ప్రభాస్ ఇలాంటి కార్టూన్ ల సినిమాకి ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మేకర్స్ ‘ఆదిపురుష్’ కు ఫిక్స్ చేసిన కొత్త డేట్ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ కు కొంత ఊరట కలిగించేలా ఉందని చెప్పొచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆది పురుష్’ చిత్రం 2023 మార్చి 30న విడుదల కాబోతుంది. ఆరోజు శ్రీరామనవమి కావడం..

లాంగ్ వీకెండ్ కు ఛాన్స్ ఉండటం, పైగా ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి ఉండడంతో మేకర్స్ ఈ డేట్ కు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ డేట్ కు మరో మూవీ ఫిక్స్ కాలేదు కాబట్టి.. ఓపెనింగ్స్ విషయంలో డోకా ఉండకపోవచ్చు. తెలుగులో ఎలా ఉన్నా హిందీ ప్రేక్షకులకు ఆ వారం రోజులు బాగా స్పెషల్ కాబట్టి.. ‘ఆదిపురుష్’ మేకర్స్ పోస్ట్ పోన్ చేయడం సరైన నిర్ణయమే అనుకోవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus