Amit Shah, Jr NTR: బీజేపీ సెకండ్‌ మ్యాన్‌తో యంగ్‌ టైగర్‌!

  • August 22, 2022 / 11:11 AM IST

సండే నాడు మామూలుగా కామ్‌గా ఉండే సినిమా పరిశ్రమ.. 21న అంటే నిన్న కాస్త సందడిగానే గడిచింది. కారణం ఏవేవో సినిమాల కార్యక్రమాలు, షూటింగ్‌లో కాదు. దేశంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఓ పార్టీలో సెకండ్‌గా ఉన్న నాయకుణ్ని.. ఓ స్టార్‌ హీరో కలుస్తాడు అనే మాట బయటకు రావడం, ఎందుకు కలుస్తాడు అనేది చెప్పడకపోవడం, ఆఖరికి ఆ హీరో ఆ నాయకుణ్ని కలవడం. దీంతో ఉదయం నుండి గాసిప్‌గా మొదలై, వార్తగా మారి, సాయంత్రానికి పూర్తయింది. వాళ్లెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. నాయకుడు అమిత్‌ షా అయితే, హీరో ఎన్టీఆర్‌.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే.. టీడీపీ. టీడీపీ అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ అని కొన్నేళ్లు గడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ రాజకీయ యాత్ర కూడా చేశాడు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంకే పార్టీకీ ఆయన దగ్గర కాలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన ఏ పార్టీకీ మద్దతు చెప్పలేదు. అలాంటి ఎన్టీఆర్‌ తనకు తాను అమిత్‌ షాను కలవడం ఏంటి అనే మాట చర్చగా మారింది. ఆదివారం మొత్తం ఈ చర్చే నడిచింది. అయితే బీజేపీ నాయకత్వమే ఎన్టీఆర్‌ను పిలిచింది అనే టాక్‌ కూడా నడిచింది.

అనుకున్నట్లుగా రాత్రి 8 తర్వాత అమిత్‌ షాను ఎన్టీఆర్‌ కలుసుకున్నారు. నగరంలోని పెద్ద హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తోడొక్కిన మరీ అమిత్ షాకు దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ కలసి భోజనం కూడా చేశారు. ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయంలో ఎక్కడా సమాచారం లేదు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ నటనను చూసి మురిసిపోయిన అమిత్‌ షా పిలిపించి మాట్లాడారు అంటూ ఓ మాట వినిపిస్తోంది. అయితే ఇదే సినిమాలో ఎన్టీఆర్‌ గెటప్‌ చూసి బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆ విషయం పక్కనపెడితే.. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ వర్గానికి చెందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు అమిత్‌ షా కలిశారు అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కోసం ఎన్టీఆర్‌ ఏమన్నా బీజేపీతో మాట్లాడారా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే రీసెంట్‌గా ఎన్టీఆర్‌ శైలి చూసిన వారు టీడీపీతో ఆయన మళ్లీ కలవడం కష్టమే అంటున్నారు.

అయితే ఇక్కడే మరో విషయం వినిపిస్తోంది. బీజేపీ వల్ల ఇటీవల రాజ్యసభ ఎంపీ అయిన విజయేంద్రప్రసాద్‌ కారణంగానే అమిత్ షా – ఎన్టీఆర్‌ భేటీ జరిగిందని చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో తారక్‌ క్రియాశీలంగా ఉండబోతున్నాడు అనే మాట మాత్రం నిన్నటి పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోంది. మరి తెలంగాణలో అవుతాడా? లేక రెండు తెలుగు రాష్ట్రాల్లో అవుతాడా అనేది చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus