సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మూవీ ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్ర ఎక్కువ సన్నివేశాలలో బ్లాక్ డ్రెస్ తోనే కనిపిస్తుంది. బాలయ్య బ్లాక్ డ్రెస్ లో కనిపించడం వల్లే ఈ సినిమాలో కొత్తగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో బాలయ్య బ్లాక్ డ్రెస్ ధరించడం వెనుక రీజన్ ఏంటనే ప్రశ్న గోపీచంద్ మలినేనికి ఎదుదు కాగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఫ్యాన్ గా వీరసింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని బాలయ్య తెలిపారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలై అందరి నుంచి ప్రశంసలు రావడం మెమరబుల్ మూమెంట్ అని ఆయన కామెంట్లు చేశారు. లైఫ్ లో ఇది ఒక మంచి మూమెంట్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరసింహారెడ్డి మూవీ హై లెవెల్ లో తీశామని ఇంకా హై లెవెల్ లో కూడా సినిమాలను తీయడం సాధ్యమేనని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.
బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుందని ఆలోచించు అని బాలయ్య సలహా ఇచ్చారని నా మనస్సులో అప్పటికే ఆ ఐడియా ఉందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. బాలయ్య నుంచి బ్లాక్ డ్రెస్ ప్రతిపాదన రావడంతో పంచె, చుట్ట అన్నీ ప్లాన్ చేశామని ఆయన కామెంట్లు చేశారు. మఫ్టీ సినిమాలోని లుక్ ను ఫాలో అయ్యామని కామెంట్ చేయడం కరెక్ట్ కాదని గోపీచంద్ మలినేని తెలిపారు.
అన్ని బంధాలు వదిలి నల్లబట్ట కట్టిన నరసింహ స్వామి అని ఒక డైలాగ్ ఉంటుందని ఆ విధంగా బాలయ్య పాత్ర బ్లాక్ డ్రెస్ వేయడం గురించి జస్టిఫికేషన్ ఇచ్చామని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?