Jayasudha: జయసుధ ఆ సినిమా చేయడానికి కారణం ఆ దర్శకుడేనా..!

ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి జీవించే హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు జయసుధ, సంసారం పక్షమైన పాత్రలకు పెట్టింది పేరు లాగ ఉండే జయసుధ ని అందరూ సహజ నటి అని పిలిచే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమె నటిస్తుంటే మన ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, వదిన వంటి వారు గుర్తుకు వస్తారు. భార్య పాత్ర చేస్తే ఇలా కదా ఉండాలి భార్య అంటే అని అనిపిస్తాది ఈమె సహజమైన నటన చూస్తే.

అందుకే ఆమెకి ఆ బిరుదు వచ్చింది. హీరోయిన్ గా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన జయసుధ, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిసుగా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ కూడా అమ్మ పాత్రలకు ఆమెనే ఛాయస్ అవుతుంది అంటే, ఆమెకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే జయసుధ తో తనకి ఉన్న అనుభందం గురించి మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు ఒకసారి చెప్తాడు. అప్పట్లో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సత్యనారాయణ ని పెట్టి మొరటోడు అనే సినిమా చేసాడు.

ఈ చిత్రానికి దర్శకుడిగా ప్రముఖ కమెడియన్ నగేష్ వ్యవహరించాడు. ఆరోజుల్లో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే అప్పట్లో హీరోయిన్స్ తమ రేంజ్ కంటే తక్కువ ఉండే వారితో సినిమాలు చెయ్యడానికి అసలు ఇష్టపడేవారు కాదు. జయసుధ అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు వంటి టాప్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది.

అలాంటి ఆమెని (Jayasudha) సత్యనారాయణ పక్కన హీరోయిన్ గా నటిస్తావా అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసింది అట. ఈ సినిమా వీళ్లిద్దరి మధ్య జరిగే రొమాన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు, కేవలం రామానాయుడు అడిగాడనే ఒక్క కారణం తో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుందట జయసుధ, తన మీద అంత అభిమానం ఉండేది అని చెప్పుకొచ్చాడు రామానాయుడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus