Jr NTR: ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు ఎన్టీఆర్ అందుకే దూరంగా ఉన్నాడా?

నందమూరి కుటుంబానికి ఇండస్ట్రీలో చాలా గొప్ప పేరుంది. సినిమాల నుండి బయటకు వచ్చి చూసినా నందమూరి కుటుంబం అంటే జనాల్లో చాలా గౌరవం ఉంది. నందమూరి తారక రామారావు గారు పడ్డ నిరంతర శ్రమ.. ఈ కుటుంబానికి సినీ పరిశ్రమలో గాని, రాజకీయ వర్గాల్లో గాని.. ప్రత్యేక గుర్తింపు ఏర్పడేలా చేసింది అని చెప్పొచ్చు. ఆయన పేరును నిలబెడుతూ నందమూరి ఫ్యామిలీ అంతా వివిధ రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ, ఎన్టీఆర్ లు సినీ పరిశ్రమలో స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇంత గొప్ప పేరున్న నందమూరి కుటుంబంలో .. ఐక్యత లోపించిందనే కామెంట్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు వినిపించాయి.ఇప్పటికీ అవి తగ్గలేదు అనే చెప్పాలి. అసలు మేటర్లోకి వెళితే… రెండు రోజుల క్రితం నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కంటమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, వంటి వారితో పాటు నందమూరి ఫ్యామిలీ అంతా ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లి..

ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఉమా మహేశ్వరిని చివరి చూపు చూసుకునేందుకు రాలేదు. బుధవారం నాడు అంత్యక్రియలకు హాజరవుతాడేమో అని అంతా అనుకున్నారు.కానీ అలా జరగలేదు. ఎన్టీఆర్ రాకపోవడానికి ప్రధాన కారణం అతను ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడమే అని తెలుస్తుంది. ఎంత విదేశాలకు వెళ్లినా.. ఈ వార్త తెలుసుకుని ఇండియా కి రావడానికి టైం పడుతుందా? అని ప్రశ్నించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

మరోపక్క నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు ఉన్న విభేదాల కారణంగా అతను హాజరు కాలేదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు స్టార్ ఇమేజ్ వచ్చే వరకు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పేరును, బాలకృష్ణ పేరును వాడుకున్నాడని.. స్టార్ ఇమేజ్ వచ్చాక మాత్రం నందమూరి ఫ్యామిలీని లెక్క చేయడం లేదని కొందరు హార్డ్-కోర్ నందమూరి అభిమానులు మండిపడుతున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus