Jr NTR: ఆ ఒక్క కారణంతోనే ఎన్టీఆర్ ‘ఊపిరి’ వదులుకున్నాడా?

ఈరోజుతో ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie). సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ‘ఊపిరి’ (Oopiri) సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ లైన్ తో మొదలుపెడదాం. అయితే ఈ 2 సినిమాలకి సింక్ ఏంటి? అంటే ఎవరైనా ఏం చెబుతారు? ఇవి రెండు టాలీవుడ్ సినిమాలు, మల్టీస్టారర్ సినిమాలు అని చెబుతారు. ఇంకోటి ఈ రెండు మల్టీస్టారర్ సినిమాలు మార్చి 25 డేట్ కే రిలీజ్ అయ్యాయి అంటారేమో. ఇవి కాకుండా.. ఇంకో కామన్ లింక్ కూడా ఉంది. అదే ఎన్టీఆర్..!  (Jr NTR) అవును మీరు చదువుతున్నది నిజమే. ఎలా అంటారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

Jr NTR

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఓ హీరోగా నటించాడు. కొమరం భీమ్ పాత్రలో అతను అదరగొట్టాడు. రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 4వ సినిమా ఇది. మరో స్టార్ హీరో రాంచరణ్ తో (Ram Charan) ఎన్టీఆర్ కాంబినేషనల్ సీన్స్ అభిమానులను మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా అలరించాయి. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటలో ఈ ఇద్దరు హీరోలు కలిసి వేసిన స్టెప్పుల గురించి ఇంకో 10 ఏళ్ళు చెప్పుకుంటారు అనడంలో సందేహం లేదు. ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

సరే ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ ఒక హీరో. కానీ ‘ఊపిరి’ తో అతనికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉండవచ్చు. వాస్తవానికి ‘ఊపిరి’ లో ఎన్టీఆర్ (Jr NTR) ఒక హీరోగా చేయాలి. అవును అప్పట్లో నాగార్జున (Nagarjuna) – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అని ప్రచారం గట్టిగా జరిగింది. వంశీ పైడిపల్లికి  (Vamshi Paidipally)  కూడా ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి.. ఈ కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం.. కార్తీ వచ్చి చేరడం జరిగింది. ‘ఊపిరి’ లో కార్తీ (Karthi)  పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది.

‘ఎన్టీఆర్ ఆ పాత్రని మిస్ చేసుకున్నాడే’ అని ఎవ్వరూ డిజప్పాయింట్ అయ్యేలా ఉండదు. ఎందుకంటే కార్తీ వందకి వంద శాతం ఆ పాత్రకి న్యాయం చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఈ పాత్ర చేసి ఉంటే.. అతని మాస్ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేది కాదు. అందుకే ఎన్టీఆర్ కూడా… ‘ మల్టీస్టారర్ తీయడం అనేది చిన్న విషయం కాదు. మన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం ఉంటేనే దర్శకులతో ముందుకు వెళ్ళాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి అర్థం ‘తన ఇమేజ్ వంశీ పైడిపల్లికి ఇబ్బంది కలిగిస్తుంది’ అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ‘ఊపిరి’ నుండి తప్పుకుని ఉండొచ్చు అనేది స్పష్టమవుతుంది.

ఒకే శుక్రవారంపై ఆధారపడ్డ ముగ్గురు నితిన్..ల కెరీర్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus