Mohan Babu: మోహన్ బాబు బెయిల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనట..!

ఇటీవల మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డు కెక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun)  జైలు వ్యవహారానికి ముందు మీడియాకి ఎక్కువ స్టఫ్ ఇచ్చింది మంచు ఫ్యామిలీనే. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా ఈ వ్యవహారం సైడ్ ట్రాక్ అయ్యింది. అయితే మోహన్ బాబు (Mohan Babu) తన ఇంటి వద్ద ఓ రిపోర్టర్ పై మైకు తీసుకుని దాడి చేయడం అనేది పెద్ద సంచలనం సృష్టించింది. మోహన్ బాబుపై మీడియా అంతా నిరసనకి దిగింది.పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు కూడా నమోదైంది.

Mohan Babu

తర్వాత అతను హాస్పిటల్లో చేరడం, డిశ్చార్జ్ అయ్యాక మీడియాకి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ ముప్పు పొంచి ఉందని తెలియడంతో ముందస్తు బెయిల్ కొరకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు లాయర్.. తన క్లైంట్(మోహన్ బాబు) చాలా కాలంగా మతి మరుపుతో బాధపడుతున్నారని, దీంతో అతను ఓ సందర్భంలో మీడియా వాళ్ళు అనే సంగతి మర్చిపోయి వాళ్ళ పై దాడి చేసినట్లు జడ్జి ముందు చెప్పారట.

ఈ కారణం అందరూ ఏకీభవించేలా లేకపోవడంతో మోహన్ బాబు పెట్టుకున్న బెయిల్ రిక్వెస్ట్ ను హైకోర్టు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. పీకల మీదకు వచ్చినప్పుడు సెలబ్రిటీలు ఇలా లేని పోనీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడం సాధారణ విషయం అయిపోయిందని కూడా ఈ సందర్భంగా జడ్జి మోహన్ బాబు అతను లాయర్ కి చురకలు అంటించినట్టు స్పష్టమవుతుంది.

గతంలో ఓ స్టార్ హీరో కూడా ఇలా ‘మానసిక స్థితి సరిగ్గా లేదు అని డాక్టర్ల నుండి లెటర్ తెచ్చుకుని ముందస్తు బెయిల్ తెచ్చుకున్న’ సందర్భాన్ని ఈ సందర్భంగా కోర్టులో అంతా గుర్తుచేసుకున్నట్టు అయ్యిందట.

‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ ను మేకర్స్ అందుకే రిలీజ్ చేయడం లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus