స్టార్ హీరో పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే. అయితే కొన్నేళ్ల క్రితమే రాజమౌళి పవన్ కళ్యాణ్ కు విక్రమార్కుడు కథ చెప్పగా కొన్ని కారణాల వల్ల పవన్ ఆ సినిమా కథకు నో చెప్పడం జరిగింది. ఒకవేళ పవన్ విక్రమార్కుడు కథకు ఓకే చెప్పి ఉంటే మాత్రం పవన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరి ఉండేది.
విక్రమార్కుడు సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయగా అప్పట్లో ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 26 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు సాధించింది. ఛత్రపతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రాజమౌళి పవన్ తో విక్రమార్కుడు సినిమా చేద్దామని ఆయనను అప్రోచ్ అయ్యారు. అయితే బంగారం సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ అప్పటికే అన్నవరం సినిమాకు ఓకే చెప్పారు.
అన్నవరం సినిమా తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకోవాలని అనుకున్న పవన్ తాను విక్రమార్కుడు చేయలేనని రాజమౌళికి వెల్లడించారు. అలా ఆ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని పవన్ మిస్ చేసుకోగా రాజమౌళి అదే కథను రవితేజకు చెప్పి ఒప్పించారు. కథ నచ్చినా పవన్ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయడంతో రవితేజ ఈ సినిమాలో నటించి తన మార్కెట్ ను పెంచుకున్నారు. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాథోడ్ పాత్రలలో రవితేజ జీవించారు. ఈ సినిమా రవితేజను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది.