Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పదవులు తీసుకోవడం వెనుక కారణాలివే!

  • June 15, 2024 / 06:48 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) హోం శాఖ కేటాయిస్తారని అందరూ భావించినా ఎవరూ ఊహించని విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖలు ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖలు తీసుకోవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. ఒక అవ్వకు ఇచ్చిన మాట కోసం పవన్ ఈ శాఖలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ గతంలో అరకు ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు నీళ్ల కోసం బిందెలతో నిలబడటం పవన్ గమనించారు. అక్కడ లభ్యమయ్యే నీళ్లు సైతం పురుగులు, క్రిములతో ఉండటం పవన్ గమనించారు. ఆ ముసలావిడ తాగేందుకు కొంచెం నీళ్లు వచ్చేలా చూడండి బాబూ అని చేసిన కామెంట్లు పవన్ ను కదిలించాయి. రాష్ట్రంలో అలాంటి గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.

ఒక సమావేశంలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనకు ఎదురైన అనుభవాల గురించి వివరించారు. ఆ అవ్వ మీ ప్రభుత్వం వచ్చిన సమయంలో మా ఊరిని గుర్తు పెట్టుకో అని చెప్పిందని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గ్రామీణ నీటి సరఫరా శాఖను తీసుకోవడం వెనుక అసలు కారణాలివేనని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన అభిరుచికి అనుగుణంగా ఆ అవ్వకు ఇచ్చిన మాట కోసం శాఖలు ఎంచుకున్నారని భోగట్టా.

పవన్ కళ్యాణ్ మరో నెల రోజుల తర్వాత షూటింగ్ లలో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఓజీ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతల నుంచి ఇందుకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus