‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తుఫాన్ తెస్తాయని నాగార్జున చెప్పారు. ఆ తుఫాన్ మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు రమ్య, మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే రచ్చ మొదలుపెట్టింది. వాళ్ల టార్గెట్ ఒక్కరే.. హౌస్ కెప్టెన్ కళ్యాణ్. పక్కా స్ట్రాటజీతో కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రమ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.!సోమవారం ఎపిసోడ్ ను గమనిస్తే..రమ్య, మాధురి కలిసి కళ్యాణ్ క్యారెక్టర్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు.
“కళ్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు. శ్రీజ ఉన్నప్పుడు ఒకలా, ఆమె వెళ్లిపోయాక మరోలా బిహేవ్ చేస్తున్నాడు. అసలు అతనితో మాట్లాడాలని కూడా లేదు” అంటూ మాధురి దగ్గర ఓపెన్ అయ్యింది రమ్య. దీనికి మాధురి కూడా వంత పాడుతూ, “అవును.. మనం ఇక్కడికి ఆ అబ్బాయితో మాట్లాడటానికి రాలేదు కదా” అని సపోర్ట్ చేసింది. తన ప్రొఫెషన్ కూడా మర్చిపోయి అమ్మాయిలతో అలా ప్రవర్తించడం బాగోలేదంటూ ఇద్దరూ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. కళ్యాణ్ , తనూజ మధ్య ఉన్న బాండింగ్‌ను చూసి రమ్య ఒక్కసారిగా ట్రిగ్గర్ అయ్యింది.
“తనూజ మీద కళ్యాణ్ చేతులు వేసి తడమడం చూస్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఒకవేళ నాతో గనుక అలా ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిస్తా. అక్కడితో ఆగను, కిందపడేసి తొక్కుతా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. “రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది. వాళ్లిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు” అని ఫైర్ అయ్యింది. ఈ మాటలకు మాధురి కూడా నిజమే అన్నట్టు తల ఊపడం గమనార్హం.
బలమైన కంటెస్టెంట్లను టార్గెట్ చేసి, వాళ్ల ఫ్యాన్స్‌ను తమ వైపు తిప్పుకునే స్ట్రాటజీతోనే వీళ్లు గేమ్ మొదలు పెట్టినట్టు క్లియర్‌గా అర్థమవుతోంది.ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఈ వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. ప్రస్తుతానికి నామినేట్ అయిన వారి జాబితా చూస్తే సుమన్ శెట్టి (తనూజ నామినేట్ చేసింది).. పవన్ (రమ్యా రాథోడ్ నామినేట్ చేసింది).. భరణి (సంజన నామినేట్ చేసింది). మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.