Rashmi: గుంటూరు కారంలో ఆ రోల్ ను రష్మీ అందుకే రిజెక్ట్ చేసిందా?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా ఇప్పటికీ పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ లో కనిపించే అవకాశం మొదట రష్మి గౌతమ్‌కి వచ్చిందని అయితే వేర్వేరు కారణాల వల్ల రష్మి గౌతమ్‌ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని సమాచారం అందుతోంది. మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే సాధారణంగా ఎవరూ నో చెప్పరు. ఒక సాంగ్, కొన్ని సీన్స్ లో చేయడం వల్ల కెరీర్ పై ప్రభావం పడుతుందని మంచి రోల్ అయితే మాత్రమే చేయాలని రష్మి గౌతమ్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో రష్మి గౌతమ్‌ హీరోయిన్ గా కూడా ఎక్కువ సినిమాలలో నటించలేదు. సినిమాల ద్వారా రష్మి గౌతమ్‌కి ఆశించిన రేంజ్ లో సక్సెస్ దక్కకపోయినా బుల్లితెర షోలు మాత్రం ఆమె రేంజ్ ను మార్చేశాయనే సంగతి తెలిసిందే. రష్మి గౌతమ్‌ సైతం కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. భోళా శంకర్, మరికొన్ని సినిమాలలో రష్మి గౌతమ్‌ రోల్స్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి అలాంటి తప్పులు రిపీట్ కాకుండా అడుగులు వేస్తున్నారు.

అయితే గుంటూరు కారం మూవీ పూర్ణకు మాత్రం బాగానే హెల్ప్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పూర్ణ వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. గుంటూరు కారం ఆఫర్ గురించి రష్మి గౌతమ్‌ నోరు మెదిపితే మాత్రమే పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

రష్మి గౌతమ్‌ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. రష్మి గౌతమ్‌ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రష్మి గౌతమ్‌ (Rashmi) టీవీ షోలకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus