Revanth: హౌస్ లో రేవంత్ ఏడవటానికి కారణం ఆమేనా?

బిగ్ బాస్ అంటేనే ఎమోషన్స్ తో ఆడుకోవడం. హౌస్ మేట్స్ కి ఏదైతే ఇష్టం లేదో అదే పని చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు, పెట్టే ఫిట్టింగ్ లు అలాగే ఉంటాయి. అయితే, ఈసారి సీజన్ లో నేరుగా నామినేషన్స్ కాకుండా బిగ్ బాస్ టాస్క్ ద్వారా హౌస్ మేట్స్ ని నామినేషన్స్ లోకి తీస్కుని వస్తున్నాడు. నిజానికి ఎప్పుడు రాగానే హౌస్ మేట్స్ వాళ్లకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్లని ఏదో ఒక సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసేవారు.

ఇప్పుడు ఆ గొడవ లేకుండా బిగ్ బాస్ మూడు టీమ్స్ గా వాళ్లని విభజించుకోమని చెప్పాడు. ఇక్కడే ట్రాష్ టీమ్ లో ఉన్న రేవంత్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. వాష్ రూమ్ లోకి వెళ్లి చాలాసేపు ఏడ్చాడు. అసలు రేవంత్ ఏడవటానికి కారణం ఏంటంటే., ట్రాష్ టీమ్ లో ఉన్న ఇంటి సభ్యులు నేరుగా క్లాస్ టీమ్ కి వెళ్లేందుకు బిగ్ బాస్ స్వాప్ చేసుకోమని, అందుకోసం టీమ్ మెంబర్స్ ఏకాభిప్రాయంతో వెళ్లాలని చెప్పాడు. క్లాస్ టీమ్ చర్చించుకుని బాలాదిత్యని ఎంపిక చేసుకుంది.

ఇక్కడే ట్రాష్ టీమ్ పార్టిసిపెంట్ ని ఎంచుకోవడానికి చాలా కష్టపడింది. ఎంతో సేపు ఇనయా సుల్తానా తను వెళ్తానని ఆర్గ్యూ చేసింది. గలాటే గీతు కూడా తను వెళ్తానని పట్టుపట్టింది. మద్యలో ఉన్న రేవంత్ ఎటూ తేల్చుకోలేకపోయాడు. రాత్రి నుంచీ నిద్రలేదని, గార్డెన్ ఏరియాలో పడుకోలేకపోయానని, ఫుడ్ కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇవేమీ పట్టించుకోని ఇద్దరు అమ్మాయిలు ఆర్గ్యూ చేసుకున్నారు. ట్రాష్ టీమ్ లో ఉన్న ముగ్గురులో ఎంతసేపటికీ ఏకాభిప్రాయం రాలేదు.

దీంతో రేవంత్ ఫ్రస్టేట్ అయ్యాడు. గీతు మాత్రం తగ్గేదేలే నేను స్వాప్ అవుతా అంటూ పట్టుపట్టింది. దీంతో రేవంత్ మెట్టు దిగాడు. చివరకి గీతూని క్లాస్ టీమ్ కి పంపించాడు. అయితే, ఇక్కడే చాలాసేపు బాధపడ్డాడు. అర్జున్ కళ్యాణ్ కాసేపు ఓదార్చే ప్రయత్నం చేసాడు. దీంతో బాత్రూమ్ లోకి వెళ్లి రేవంత్ ఏడ్చాడు. నేహా చౌదరి, కీర్తిభట్ ఇద్దరూ కూడా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ, ఎమోషనల్ అయిపోయిన రేవంత్ ఏడుపుని ఆపుకుంటూ జలుబు చేసిందంటూ కాసేపు కవర్ చేశాడు.

అక్కడికి వచ్చిన చంటి, బాలాదిత్య ఏడవకు అంటూ ధైర్యం చెప్పారు. నిజానికి రేవంత్ బాధపడింది గీతు వెళ్లినందుకు కాదు. తన కష్టాన్ని కన్సిడర్ చేయనందుకు బాగా ఫీల్ అయ్యాడు. అమ్మాయనే భావనతో నేను కన్సిడర్ చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus