కన్నడ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకొని నేడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ఇంపార్టెంట్ ఉండదు సినిమాని కూడా కలర్ ఫుల్ గా చూపించారు కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఇలా ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది.
ఇలా తన సినిమాలో ఈ విధమైనటువంటి ఎలివేషన్స్ ఏమీ లేకపోయినా సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాయడం వెనక ఉన్న ఈయన సక్సెస్ మంత్రం ఏంటి అనే విషయానికి వస్తే.. ఏ సినిమా అయినా ప్రేక్షకుల అంచనాలను అనుగుణంగానే ఈయన స్టోరీని సిద్ధం చేస్తారు. ప్రేక్షకుల నాడి తెలిసినటువంటి ప్రశాంత్ హీరో కటౌట్ చూపిస్తేనే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారనే కాకుండా ఆయన పిడికిలి చూపించిన ఆయన నీడ చూపించినా కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ కావాలన్న ఉద్దేశంతో సరికొత్త ఎలివేషన్స్ ఇస్తుంటారు.
సినిమాని ఎక్కడ హైప్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో బాగా తెలిసిన వ్యక్తి ప్రశాంత్ అందుకే స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రేక్షకుల ఆలోచనలను వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టు సిద్ధం చేస్తారని అదే ఆయన సక్సెస్ కు దోహదం చేస్తుందని తెలుస్తుంది. అందరూ సినిమా పిచ్చితో ఇండస్ట్రీలోకి వస్తారు కానీ నేను మాత్రం డబ్బు సంపాదించడం కోసమే డైరెక్షన్ కోర్సులోకి చేరి ఇండస్ట్రీ లోకి వచ్చానని ఒకానొక సందర్భంలో ప్రశాంత్ తెలిపారు.
సినిమా కలర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది కానీ ఈయన మాత్రం బొగ్గు గనులలో సినిమా చేసి కూడా ప్రేక్షకులు నచ్చేలా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాను మందు తాగే స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని అలాగే స్క్రిప్ట్ రాసేటప్పుడు తప్పకుండా సినిమా బొగ్గు ఉండాలని ఈయన చెబుతుంటారు. ఇలా తన సినిమాలన్నీ కూడా డార్క్ షేడ్ లో ఉండడానికి కారణం తనకు ఉన్నటువంటి ఓసిడి సమస్య కారణమని ప్రశాంత్ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక ఇటీవల తన డైరెక్షన్లో వచ్చినటువంటి సలార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!