Star Heroes: ఆస్టార్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారో తెలిస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు!

ఇటీవల కాలంలో సినిమాల్లో హీరోలు చేసే ప్రతి క్యారెక్టర్‌ ఒక సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. అయితే కొన్ని క్యారెక్టర్స్‌ మాత్రం చాలెంజ్‌ చేస్తాయి. మంచి మేకోవర్‌ని డిమాండ్‌ చేస్తాయి. అలాంటి క్యారెక్టర్స్‌ని చాలెంజ్‌గా తీసుకుని మేకోవర్‌ అయి పోతుంటారు స్టార్స్‌. ఇప్పుడు కొందరు స్టార్స్‌ కొత్త మేకోవర్‌ కోసం షూటింగ్స్‌ నుంచి కొంత గ్యాప్‌ తీసుకుని, స్పెషల్‌గా ట్రైన్‌ కావాలనుకుంటున్నారు. ఆ స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

మహేష్ బాబు

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్‌ అడ్వెంచరెస్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాదిప్రారంభంలో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలల పాటు మహేశ్‌బాబు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇందు కోసం మహేశ్‌ మూడు నెలల కఠోర శ్రమతో కూడిన ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.

జూ.ఎన్టీఆర్

పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎంతటి రిస్క్‌ అయినా తీసుకుంటారు. క్లిష్టమైన వర్కౌట్స్‌ చేయడానికి కూడా వెనకాడరు. హిందీలో యశ్‌రాజ్‌ చోప్రాబ్యానర్‌పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్యా చోప్రా‘వార్‌ 2’ చిత్రం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని తన రోల్, లుక్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

అల్లు అర్జున్

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ మేకోవర్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరోసారి ఆడియన్స్‌ వావ్‌ అనేలా అల్లు అర్జున్‌ మేకోవర్, లుక్‌ ఉండబోతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ గెటప్‌ కొత్తగా ఉంటుందని, ఈ గెటప్‌ మేకోవర్‌ కోసం అల్లు అర్జున్‌ కొంత టైమ్‌ తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ సినిమా కోసం వర్కౌట్‌ చేస్తారని తెలుస్తోంది.

సాయిధరమ్‌ తేజ్‌

సాయిధరమ్‌ విరూపాక్ష మూవీ తర్వాతి చిత్రం సంపత్‌ నంది దర్శకత్వంలో ఉంటుంది. భారీ బడ్జెట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. ఆరు నెలల బ్రేక్‌లో సాయిధరమ్‌ ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కౌట్స్‌ ఈ సినిమాకు కూడా ఉపయోగపడతాయని, తను సరికొత్త మాస్‌ లుక్‌లో కనిపించే అవకాశం ఉంది.

ఇలా షూటింగ్స్‌ నుంచి కొంత గ్యాప్‌ తీసుకుని తమ కొత్త సినిమాల గెటప్‌ల కోసం ట్రైనింగ్‌ తీసుకోవడానికి మరికొందరు (Star Heroes) స్టార్స్‌ కూడా రెడీ అవుతున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus